ప్రస్తుతం ఇండియా లో ఎక్కడ చూసినా కూడా ఒకే సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. అదే ప్రభాస్ హీరోగా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సలార్ మూవీ గురించి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకేక్కిన ఏ మూవీలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.


 అంతేకాదు ప్రభాస్ ప్రాణ స్నేహితుడి పాత్రలో కోలీవుడ్ స్టార్ పృధ్విరాజ్ సుకుమారన్ నటిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇటీవల విడుదలైన టీజర్ ట్రైలర్ ఇక సలార్ సినిమాపై అందరిలో ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి అనడంలో సందేహం లేదు. అయితే ఈ ట్రైలర్ లో చూస్తేనే ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమారిన్ ఇక ఈ పాత్రలు చేయడానికి ఎంతలా కష్టపడ్డారో అర్థం అవుతుంది. ఈ క్రమంలోనే ఇక ఈ సినిమాలో ఎంత రెమెండరేషన్ తీసుకున్నారో అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ప్రభాస్ పృధ్విరాజ్ సుకుమారన్ ఇద్దరూ కూడా కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్ పుచ్చుకున్నారట.


 సలార్ రెండు పార్ట్ లుగా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది అన్న విషయం తెలిసిందే  ఈ క్రమంలోనే ఒక్క పార్ట్ కోసమే ప్రభాస్ ఏకంగా 100 కోట్ల రూపాయల పారితోషకం తీసుకున్నాడట. ఇక అలాగే పృధ్విరాజ్ సుకుమారన్ 18 నుంచి 25 కోట్ల మధ్య పారితోషకం పుచ్చుకున్నాడని తెలుస్తోంది. అయితే సినిమాలో మెయిన్ హీరో ప్రభాస్ అయినప్పటికీ ఏకంగా ప్రభాస్ తో సరితూగే పాత్రలోనే పృధ్విరాజ్ కూడా నటిస్తూ ఉన్నాడు. ఇక మొదటి పార్ట్ మొత్తం పృథ్విరాజ్ పాత్ర చుట్టే కథ ఉంటుంది అన్న టాక్ కూడా వినిపిస్తుంది అని చెప్పాలి. కాగా ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీన విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: