టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించినటువంటి వారిలో నటుడు శివాజీ ఒకరు. ఈయన హీరోగా దాదాపు 90 కి పైగా సినిమాలలో నటించారు.ఇలా టాలీవుడ్ హీరోగా మంచి గుర్తింపు పొందినటువంటి శివాజీ బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాల ద్వారా శివాజీ మరింత పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగుతూ ఉన్నటువంటి విజేతగా నిలుస్తారని అందరూ భావించారు. కానీ చివరి వారాలలో శివాజీకి ఓటింగ్ శాతం పూర్తిగా తగ్గిపోవడంతో ఈయన టైటిల్ రేసులో కాస్త వెనుకబడ్డారు. దీంతో టాప్ త్రీ కంటెంట్ గా బయటకు వచ్చారు. శివాజీ బిగ్ బాస్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈయన నటించిన వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 90s వెబ్ సిరీస్ హీరోగా క్యారక్టర్ ఆర్టిస్టుగా సుమారుగా 96 సినిమాలు చేసిన రాని క్రేజ్ ఈ సీరియస్ ద్వారా వచ్చిందని చెప్పాలి.ఇక ఈ సిరీస్ బిగ్ బాస్ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ఆయనకు వచ్చిన క్రేజ్ క్యాష్ చేసుకొని ఈ టీవీ విన్ ఓటీటీలో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సిరీస్ కి భారీ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఇక ఈ సిరీస్ లో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా శివాజీ ఎంతో అద్భుతంగా నటించారు. పవన్ కళ్యాణ్ చెల్లెలు వాసుకి నటించారు.

ఇక ఈ వెబ్ సిరీస్ 90 కిడ్స్ అందరికీ కూడా ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాలి. మొత్తానికి ఈ వెబ్ సిరీస్ ద్వారా శివాజీ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ ద్వారానే ఈ సిరీస్ అంత హిట్ అయిందని చెప్పాలి. సిరీస్ కి ఇప్పటి వరకు 100 మిలియన్ కి పైగా వాచ్ మినిట్స్ వచ్చాయట. ఇప్పటి వరకు ఈటీవీ విన్ యాప్ లో ఇన్ని వ్యూస్ వచ్చిన వెబ్ సిరీస్ కానీ, సినిమా కానీ లేదట.  ఇకపోతే ఈ సిరీస్ లో నటించినందుకు గాను శివాజీకి భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ ఇచ్చారని తెలుస్తుంది. ఈ సిరీస్ కోసం శివాజీ బిగ్ బాస్ రెమ్యూనరేషన్ కంటే రెండింతలు ఎక్కువగా రెమ్యూనరేషన్ అందుకున్నారని ఈ సిరీస్ కోసం దాదాపుగా 70 లక్షల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఒక వెబ్ సిరీస్ కోసం ఈ స్థాయిలో డబ్బు తీసుకోవడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. బిగ్ బాస్ తర్వాత ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి శివాజీ తిరిగి ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు పలు సందర్భాలలో వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: