మెగాస్టార్ చిరంజీవి కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీ గా ఉండగా సీనియర్ హీరో లలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో గా చిరంజీవి వార్త ల్లో నిలిచారు.చిరంజీవి తాజాగా తన కుటుంబ సభ్యుల తో కలిసి గ్రాండ్ గా సంక్రాంతి సంబరాలు జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుపుకున్న ఆ ఫామ్ హూస్ విలువ ఏకంగా 30 కోట్ల రూపాయలు అని సమాచారం.ఈ విషయం తెలిసి కొంత మంది నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతుండగా మరి కొందరు మాత్రం చిరంజీవి రేంజ్ కు 30 కోట్ల రూపాయల ఖర్చు పెద్ద విషయం కాదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చిరంజీవి షేర్ చేసిన ఫోటోలు సైతం సోషల్ మీడియా వేదిక గా తెగ వైరల్ అవుతున్నాయి. సంక్రాంతి సంబరాలలో అల్లు అరవింద్, రామ్ చరణ్, బన్నీ పాల్గొన్నారు. బెంగళూరుకు 30 కిలోమీటర్ల దూరం లో ఉన్న దేవనహళ్లిలో ఈ ఫామ్ హౌజ్ ఉందని సమాచారం అందుతోంది. ఈ ఫామ్ హౌజ్ లో ఆచార్య సినిమా షూటింగ్ జరిగిందని భోగట్టా. మరోవైపు చిరంజీవి కొత్త మూవీ విశ్వంభర టైటిల్ తో తెరకెక్కుతోందని క్లారిటీ వచ్చేసింది. యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఈ సినిమా కు భారీ స్థాయి లో ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే.చిరంజీవి తర్వాత సినిమాలు సైతం భారీ స్థాయి లో, భారీ లెవెల్ లో తెరకెక్కుతున్నాయి.త్వరలో మెగాస్టార్ కొత్త సినిమాకు సంబంధించి ప్రకటన వస్తుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారం లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. చిరంజీవి వరుస సినిమా లతో బిజీ కావాలని ఆయన ఫ్యాన్స్ సైతం భావిస్తున్నారు. యంగ్ జనరేషన్ హీరో లను మెగాస్టార్ చిరంజీవి ప్రోత్సహించడం పై కూడా పాజిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. మెగా హీరోలు ప్రస్తుతం వరుసగా క్రేజీ సినిమా లతో బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: