ఇక నేడు రిపబ్లిక్ డే తో పాటు టాలీవుడ్ సీనియర్ మాస్ హీరో మాస్ మహారాజా రవితేజ బర్త్ డే కావడంతో అభిమానులు ఈ స్పెషల్ డే ని ఎంతో స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మేకర్స్ రవితేజ లేటెస్ట్ మూవీస్ కి సంబంధించి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ మాస్ మహరాజ్ రవి తేజకి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.ఈ ప్రత్యేక దినాన మాస్ డైరెక్టర్ హరిష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న 'మిస్టర్ బచ్చన్' సినిమాకు సంబంధించి రవితేజ బర్త్ డే కానుకగా ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు.హిందీలో అజయ్ దేవగన్ నటించిన 'రైడ్' సినిమాకి రీమేక్ గా మిస్టర్ బచ్చన్ సినిమా తెరకెక్కుతోంది. ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ 'రైడ్' సినిమాను తీశారు. ఇండియన్ బిజినెస్ మ్యాన్ సర్దార్ ఇందర్ సింగ్ పై దాదాపు మూడు రోజులపాటు జరిపిన ఇన్ కమ్ టాక్స్ రైడ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.ఆ మూవీని తన స్టైల్ లో రవితేజ ఇమేజ్ కి తగినట్లుగా కమర్షియల్ అంశాలను కలిపి హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీలో రవితేజ సరసన బాలీవుడ్ భామ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.
రవితేజకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్లో రవితేజ యాక్షన్ మోడ్ లో కనిపించడంతో ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇంతకముందు రిలీజ్ చేసిన 'మిస్టర్ బచ్చన్' ఫస్ట్ లుక్ లో సూపర్ కూల్ గా కనిపించిన రవితేజ లేటెస్ట్ పోస్టర్ లో మాత్రం తనదైన మార్క్ మాస్ స్వాగ్ తో ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. ఈ పోస్టర్ ని చూస్తే సినిమాలో సూపర్ యాక్షన్ సీక్వెన్స్ లాగా కనిపిస్తోంది. ఈ పోస్టర్ లో రవితేజ ఓవైపు క్లాస్ గా బ్లూ షర్ట్, బ్యాగి ప్యాంట్ లో టక్ చేసుకొని తన మాస్ స్వాగ్ తో సూపర్ గా అదరగొట్టేసారు.రవితేజ వెనకాల వింటేజ్ కార్లు, పాత బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. చాలా స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ని కర్తెకుడిలో ప్లాన్ చేశారు. ఈ సినిమాలోని ప్రధాన సన్నివేశాల షూటింగ్ కోసం మూవీ టీం తాజాగా కరైకుడికి వెళ్ళింది. అక్కడి పరిసర ప్రాంతాల్లో మెయిన్ సీన్స్ షూట్ చెయ్యనున్నారు.ఈ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్, రవితేజ కలిసి ఫ్లైట్ లో కర్తెకుడి కి వెళ్తున్న ఫోటోలను మూవీ టీం ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: