టాలీవుడ్ యువ నటుడు రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో చాలా మూవీ లతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇకపోతే ఆఖరిగా ఈ యువ నటుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రామా లో హీరో గా నటించాడు. ఈ మూవీ తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది.

పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దానితో ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రామ్ కి నిరాశనే మిగిల్చింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ నటుడు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న డబల్ ఈస్మార్ట్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ మూవీ లో ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈ సినిమా విడుదల తేదీని మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో జూన్ 14 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా మరో ఒకటి , రెండు రోజుల్లో విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: