టాలీవుడ్ హీరో జూని యర్ ఎన్టీ ఆర్ గురించి ప్రత్యేకం గా పరిచయం అ క్కర్లేదు. జూనియర్ ఎన్టీ ఆర్ ప్రస్తుతం వరుస గా సినిమాల లో నటిస్తూ దూసుకు పోతున్న విషయం తెలిసిందే.తెలుగు లో చివరగా ఆర్ఆర్ఆర్ మూవీ తో  ప్రేక్షకులను పలకరించిన జూనియర్ ఎన్టీఆర్సినిమా తో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చు కున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా తనకున్న ఫాన్స్ ఫాలోయింగ్ ని మరింత పెంచుకున్నారు ఎన్టీఆర్. తన డాన్స్ తో, నటనతో మాటల తో పాటల తో ఆకట్టు కుంటూ దేశవ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల్లో కూడా భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. డైలాగ్స్ అయినా డ్యాన్స్ అయినా తారక్ కు ఆయనే సాటి అని చెప్పవచ్చు. సింగర్ గా కూడా క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ పలు సినిమాల లో అద్భుతంగా పాటలు పాడారు..అయితే తారక్ తన సినిమాలలో ఒక పాటకు కొరియోగ్రాఫర్ గా కూడా వ్యవహరించాడట. ఈ విషయం మనలో చాలామందికి తెలియదు. ఎన్టీఆర్ హీరోగా నటించిన రభస సినిమా లోని ఒక సాంగ్ కోసం అదిరిపోయే డ్యాన్స్ స్టెప్స్ ను కంపోజ్ చేసిన తారక్ క్రెడిట్స్ మాత్రం తీసుకోలేదు. జూనియర్ ఎన్టీఆర్ హిడ్డెన్ టాలెంట్ గురించి తెలిసి ఫ్యాన్స్ సైతం ఫిదా అవుతున్నారు. ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ అవ్వడంతో చాలామంది నిజమా అంటూ షాక్ అవుతున్నారు.ఇకపోతే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. భారీ అంచనాల నడుమ కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ 80 శాతం పూర్తి అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: