కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ పార్ట్ 1 సినిమా భారీ బడ్జెట్ తో భారీ అంచనాలతో వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద జస్ట్ యావరేజ్ గా నిలిచిన సంగతి తెలిసిందే.గత ఏడాది డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకి వచ్చిన సలార్ సినిమా థియేటర్స్ లో హిట్ కొట్టి దాదాపు 600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో బాగానే స్ట్రీమ్ అయింది. ఇక ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉండటంతో ఆ సినిమా ఎప్పుడు వస్తుందా, ప్రభాస్ నుంచి మరింత యాక్షన్ ఎప్పుడు చూస్తామా అని ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే కల్కి 2898AD మూవీ షూట్ పూర్తిచేసాడు. ఇక త్వరలో రాజాసాబ్ షూటింగ్ నెక్స్ట్ షెడ్యూల్స్ కూడా మొదలు కానుంది. రాజా సాబ్ షూటింగ్ 50% పూర్తయ్యిందని ఆ సినిమా హీరోయిన్ మాళవిక మోహనన్ ఇంస్టాగ్రామ్ వేదికగా తెలిపింది.


ఇక ఆ తర్వాత సలార్ పార్ట్ 2 షూటింగ్ మొదలుపెట్టనున్నాడట ప్రభాస్. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా షూట్ నెక్స్ట్ ఇయర్ లో మొదలవుతుందని సందీప్ ప్రకటించాడు. ఈలోపు సలార్ 2 సినిమా పూర్తిచేద్దామని ప్రభాస్ ఫిక్స్ అయ్యాడట.తాజాగా సలార్ మూవీలో నటించిన బాబీ సింహ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సలార్ పార్ట్ 2 సినిమా షూటింగ్ ఏప్రిల్ నుంచి ఉండొచ్చని, ఆ సినిమా షూట్ కోసం ఎదురుచూస్తున్నానని తెలిపాడు. దీంతో ఏప్రిల్ లో సలార్ పార్ట్ 2 సినిమా షూట్ మొదలవ్వనుందని సమాచారం.బాబీ సింహ సలార్ సినిమాలో శౌర్యంగుల్లో ఒకడైనా మన్నార్స్ లో కలిసిపోయి చివర్లో ఊహించని ట్విస్ట్ ఇస్తారు. క్లైమాక్స్ లో ప్రభాస్ కూడా శౌర్యంగుడే అనే ట్విస్ట్ ఇచ్చి వదిలేయడంతో సలార్ పార్ట్ 2 పై మరిన్ని అంచనాలు పెరిగాయి. పాపం ఇలా వరుస సినిమాలతో షూటింగ్స్  లో బాగా బిజీ అయ్యి విరామం అనేదే లేకుండా ప్రభాస్ గొడ్డు కష్టం పడుతున్నాడు. ఆయన ఫ్యాన్స్ ఏమో మా ప్రభాస్ నుంచి ఆ అప్డేట్ కావాలి ఈ అప్డేట్ కావాలి అని హడావిడి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: