వాస్తవానికి హైదరాబాదులో జరిగింది దారుణమే. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ రాంగోపాల్ వర్మ కేవలం హైదరాబాద్ మేయర్ ను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారు. మేయర్ కంటే ముందు హైదరాబాద్ నగర పాలకానికి మున్సిపల్ కమిషనర్లు, ఇతర సిబ్బంది ఉంటారు. వారిని మాత్రం కించిత్ మాట కూడా అనడం లేదు. పైగా కేవలం మేయర్ ది మాత్రమే తప్పు అన్నట్టుగా రామ్ గోపాల్ వర్మ పోస్ట్లు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి స్థాయి లాంటి వ్యక్తి హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటారు. కానీ వారందరినీ వదిలిపెట్టి కేవలం హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మిని మాత్రమే వర్మ టార్గెట్ చేస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో? అది ఏ వార్డు పరిధిలోకి వస్తుందో? తెలియకుండానే రాంగోపాల్ వర్మ హైదరాబాద్ మేయర్ ను విమర్శించడం విశేషం. అన్నట్టు రామ్ గోపాల్ వర్మ గతంలో చేసిన పోస్ట్లుఒకింత ఆలోచింపచేసే విధంగా ఉండేవి. కానీ ఇప్పుడు అవి కూడా నాసిరకంగా మారిపోతున్నాయి. కేవలం మీడియాలో రెండు కాలాల వార్త రాయడానికి తప్ప.. ఆర్జీవీ పోస్ట్ ఎందుకూ పనికి రావడం లేదు. పోగొట్టుకున్న తన అస్తిత్వం కోసం వర్మ పోరాడుతున్నాడు గానీ.. అది ఎంతో కాలం మనుగడ సాగించకపోవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి