తమిళ్ తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు కుర్రకారులను ఉర్రూతలు ఊగించిన అందాల భామ నమిత ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈ అమ్మడు అసలు పేరు నమిత వాంక్వాలా.. ఈమె గుజరాత్ ప్రాంతంలో జన్మించింది 1998లో మిస్ సూరతుగా 2001లో మిస్ ఇండియా పోటీలలో నాలుగవ స్థానాన్ని కైవసం చేసుకుంది. మొదట సొంతం సినిమాలో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ వెంకటేష్ హీరోగా నటించిన జెమిని సినిమాతో భారీ క్రేజీ ని అందుకుంది. తన అందంతో అదిరిపోయే లూక్స్ తో అందరిని ఆకట్టుకుంది నమిత.. ఆ తర్వాత ఎన్నో మంచి చిత్రాలలో నటించి బ్యాక్ టు బ్యాక్ వరుస విజయాలను అందుకుంది.


సొంతం , జెమిని సినిమా తర్వాత ఒక రాజు ఒక రాణి ,ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి వంటి చిత్రాలలో నటించింది.. ఆ తర్వాత తమిళ్ కన్నడ భాషలలో కూడా నటించింది ఊహించని విధంగా గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఒక్క సారిగా బరువు పెరిగిపోయి.. 2009లో ప్రభాస్ నటించిన బిల్లా సినిమాలో మళ్లీ కనిపించింది. 2010లో వచ్చిన సింహా సినిమాలో కూడా నటించింది నమిత.. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ వివాహం చేసుకుంది. 2017 లో నటుడు వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకుంది.

వీరికి కవల పిల్లలు కూడా జన్మించారు. 2022 ఆగస్టు 19న ఈ విషయాన్ని వెల్లడించింది.. నమిత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా కనిపిస్తూ పలు రకాల ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఒక వీడియోను షేర్ చేస్తూ ఈ వీడియో చూసిన నెటిజన్స్ సైతం నమిత ఇంతలా మారిపోయింది ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు. గతంలో కంటే కాస్త అందంగా కనిపిస్తూ బరువు తగ్గినట్టుగా కనిపిస్తోంది. అభిమానులు మాత్రం మళ్లీ సినిమాలలో హీరోయిన్గా రీ ఎంట్రీ ఇవ్వాలని కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: