రామ్ చరణ్ పుట్టినరోజునాడు విడుదలైన ‘గేమ్ ఛేంజర్’ మూవీలోని జరగండి జరగండి పాటకు మిశ్రమ స్పందన వచ్చింది. ఈపాట విడుదలైన ఒక గంట లోపే సోషల్ మీడియాలో ఈ పాటను టార్గెట్ చేస్తూ చాల నెగిటివ్ కామెంట్స్ రావడంతో చరణ్ అభిమానులు కొంతవరాకు షాక్ అయినట్లు తెలుస్తోంది. ఈపాట ఆశించిన స్థాయిలో లేదు అంటూ కొందరు పెదవి విరుస్తూ ఉంటే మరికొందరు ఈపాట కంటే చరణ్ బోయపాటిల కాంబినేషన్ లో వచ్చిన ‘వినయ విధేయ రామా’ మూవీలోని పాటలు బాగున్నాయి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.  ఈ పాటలో డాన్సు మూమెంట్స్ బాగా లేవనీ ఎక్కడా ప్రభుదేవా కంపోజ్ చేసిన పాటల స్థాయిలో ‘జరగండి జరగండి’ పాట లేదు అంటూ మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. సంగీత దర్శకుడు తమన్ ఈపాటకు సరైన ట్యూన్ అందించలేకపోయాడు అంటూ మారికొందరి అభిప్రాయం. దీనితో ఈపాట పై పాజిటివిటీ కంటే నెగటివిటీ ఎక్కువగా కనిపించడంతో చరణ్ అభిమానులు మరింత కన్ఫ్యూజ్ అవుతున్నారు.ఈపాటకు గాత్రం అందించిన దలేర్ మెహందీ వాయస్ రామ్ చరణ్ కు పెద్దగా నప్పలేదు అంటూ మరికొందరు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరైతే తమన్ కంపోజింగ్స్ లో క్రేజ్ తగ్గింది అంటూ ఈమూవీ పాటకు సరైన స్పందన ఇవ్వడంలేదు. సంగీత దర్శకుడు తమన్ ‘గుంటూరు కారం’ మూవీ విడుదలకు ముందు ఆమూవీలోని పాటలకు నెగిటివ్ కామెంట్స్ బారిన పడిన విషయం తెలిసిందే.శంకర్ అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా పై అంచనాలు బాగానే ఉన్నప్పటికీ ఈమూవీ విషయంలో శంకర్ రామ్ చరణ్ తో ఒక సాహసం చేస్తున్నాడా అన్న సందేహాలు కూడ మారికొందరిలో ఉన్నాయి. వాస్తవానికి ఈమూవీ ఈ సమ్మర్ రేస్ లో విడుదలయ్యే అవకాశం ఉన్నప్పటికీ కమలహాసన్ ఇండియన్ 2 మూవీకి సంబందించిన నిర్మాణం పనులు వేగంగా ముందుకు సాగక పోవడంతో ఇప్పుడు మళ్ళీ ‘గేమ్ ఛేంజర్ వైపు అడుగులు వేస్తున్నాడు అనుకోవాలి..మరింత సమాచారం తెలుసుకోండి: