బాలీవుడ్ చరిత్రలో ఒక ట్రెండ్ సెటర్ మూవీగా ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ తీయబోతున్న ‘రామాయణం’ మూవీ 1000 కోట్ల బడ్జెట్ తో తీయబోతున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. రెండు భాగాలుగా తీయబోతున్న ఈమూవీలో శ్రీరాముడు గా రణబీర్ కపూర్ సీతగా సాయి పల్లవి ఇప్పటికే ఎంపిక అయినట్లు తెలుస్తోంది.



అత్యంత కీలకమైన రావణాసురుడి పాత్రకు కన్నడ టాప్ హీరో యష్ ఎంపీకా ఎంచుమించు కరార్ అయిందని ఈ మూవీలో అతడు నటించేందుకు 150 కోట్ల భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినట్లుగా కూడ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని ‘శ్రీరామనవమి’ రోజున ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పరిస్థితులు ఇలా ఉంటే ఈ మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించి నిర్మాతలు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సహాయం అడిగినట్లు తెలుస్తోంది.



పురాణాల విషయంలో ముఖ్యంగా రామాయణ మహాకావ్య విషయంలో త్రివిక్రమ్ కు మంచి పట్టు ఉండటంతో ఈ మూవీ స్క్రిప్ట్ విషయంలో అదేవిధంగా ఈ మూవీ తెలుగు వెర్షన్ డైలాగ్స్ విషయంలో త్రివిక్రమ్ సలహాలను తీసుకుంటే అన్నివిధాల బాగుంటుంది అన్న అభిప్రాయంతో ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ విషయమై త్రివిక్రమ్ తో చర్చలు తరువాత సినిమాలకు డైలాగ్స్ వ్రాయడం అదేవిధంగా స్క్రీన్ ప్లే వ్రాయడం పూర్తిగా తగ్గించివేశాడు.



అయితే పవన్ కళ్యాణ్ తో అతడికి ఉన్న సాన్నిహిత్యం రీత్యా ‘భీమ్లా నాయక్’ ‘బ్రో’ సినిమాలకు త్రివిక్రమ్ స్క్రిప్ట్ అందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘గుంటూరు కారం’ మూవీ తరువాత త్రివిక్రమ్ చేస్తున్న సినిమాలు ఏమీ లేవు కాబట్టి రామాయణం మూవీ విషయంలో త్రివిక్రమ్ సహాయం ఉండవచ్చు అన్న సంకేతాలు వస్తున్నాయి. ఒకవేళ ఈవిషయంలో కుదరకపోతే ప్రముఖ సంభాషణల రచయిత బుర్రా సాయి మాధవ్ సహాయం కోరె ఆస్కారం ఉంది అంటున్నారు. ఎప్పటినుంచో త్రివిక్రమ్ కు పాన్ ఇండియా మూవీ చేయాలన్న ఆశక్తి ఉంది. ఇప్పుడు ఆకోరిక ఈవిధంగా తీరుతోంది అనుకోవాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: