తెలుగు, తమిళ పరిశ్రమలలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటీమణులు అయినటువంటి తమన్నా , రాశి కన్నా ప్రస్తుతం "అరుణ్మనై 4" అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే "అరుణ్మనై" సిరీస్ లో భాగంగా వచ్చిన 3 మూవీ లు వచ్చాయి. 

అవి కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించాయి. ఈ సిరీస్ లోని మూవీ లు తెలుగు లో వేరు వేరు పేర్లతో విడుదల అయ్యాయి. ఇది ఇలా ఉంటే "అరుణ్మనై 4" సినిమా కూడా తెలుగు లో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు లో "బాక్" అనే పేరుతో విడుదల కానుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకుంది.

ఈ విషయాన్ని కూడా ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాలోని తమన్నా , రాశి ఖన్నా క్యారెక్టర్ పోస్టర్ లను కూడా విడుదల చేశారు. ఈ మూవీ లో తమన్నా ... శివాని పాత్రలో కనిపించనుండగా రాశి కన్నా ... మాయ పాత్రలో కనిపించబోతుంది.  

ఇకపోతే రాశి కన్నా ఇప్పటికే "అరుణ్మనై 3" లో హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించారు. ఈ మూవీ లోని మొదటి సాంగ్ అయినటువంటి  "అచచో" అంటే సాగే పాటను ఏప్రిల్ 14 వ తేదీన ఆదివారం రోజు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. మరి ఈ సాంగ్  ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: