#90s మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ ఏడాది జనవరిలో ఈటీవీ విన్‍లో వచ్చిన వెబ్ సిరీస్ భారీగా వ్యూస్ దక్కించుకుంది.ఈ సిరీస్‍ తో దర్శకుడు ఆదిత్య హాసన్ ఎంతో పాపులర్ అయ్యారు. ఆయన పై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సిరీస్ సూపర్ హిట్ కావడంతో ఆదిత్య హాసన్ కు వరుసగా ఆఫర్స్ వచ్చాయి నితిన్‍ తో ఓ మూవీ కోసం తాను అడ్వాన్స్ కూడా తీసుకున్నానని ఓ ఇంటర్వ్యూలో ఆదిత్య హాసన్ తెలిపారు.అయితే నితిన్ మూవీ కంటే ముందుగా ఆదిత్య హాసన్ మరో సినిమా చేస్తున్నారు. హీరోయిన్ స్వాతి రెడ్డి (కలర్స్ స్వాతి) ప్రధాన పాత్ర లో ఓ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తోనే ఆదిత్య హాసన్ సినిమాల్లో అడుగుపెడుతున్నారు.

తాజాగా ఈ సినిమా పోస్టర్ రిలీజ్ అయింది. శ్రీరామనవమి సందర్భంగా నేడు (ఏప్రిల్ 17) ఈ సినిమా టైటిల్‍ ను మూవీ టీమ్ రివీల్ చేసింది. ఈ చిత్రానికి 'టీచర్' అనే పేరును ఫిక్స్ చేసింది. టీచర్ టైటిల్‍ పై  స్వాతి అని పేరు ఉంది.90s సిరీస్‍ను నిర్మించిన నవీన్ మేడారం.. టీచర్ చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహారిస్తున్నారు.కలర్స్ స్వాతితో పాటు బాహుబలి ఫేమ్ నిఖిల్ దేవాదుల, నిత్యశ్రీ, రాజేంద్ర గౌడ్ మరియు 90s ఫేమ్ సిద్ధార్థ్, హర్ష ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విలేజ్ బ్యాక్‍డ్రాప్‍ లో ఈ చిత్రం ఉండనుందని తెలుస్తోంది. స్కూల్‍ కు వెళ్లే టీనేజ్ అబ్బాయి, అమ్మాయి మధ్య లవ్ స్టోరీ కూడా ఉండనుందని  సమాచారం.ఈ చిత్రంలో స్వాతి స్కూల్ టీచర్‌గా  నటించనున్నారు.ఈ మూవీకి సిద్ధార్థ్ సదాశివుని సంగీతం అందిస్తుండగా..త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు మేకర్స్ తెలియజేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: