'బాహుబలి-2' తో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు అయినా కూడా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా  రికార్డులు బద్దలు కాలేదు.దంగల్ ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్లు వసూలు చేస్తే.. బాహుబలి ది కన్ క్లూజన్ మాత్రం 1800 కోట్ల వసూళ్ల వరకూ వచ్చి ఆగిపోయింది. కానీ ఇండియాలో దంగల్ కంటే వసూళ్లు వచ్చాయి. దంగల్ కి 2000 కోట్ల వసూళ్లు రావడానికి కారణం చైనా మార్కెట్. చైనాలో దంగల్ కి ఇండియాలో వచ్చిన వసూళ్ల కంటే డబుల్ వసూళ్లు వచ్చాయి.దంగల్ కి వచ్చిన 2000 కోట్ల వసూళ్లలో  దాదాపు 1300 కోట్లకు పైగా చైనా నుంచి వచ్చాయంటే అక్కడ ఏ రేంజ్ లో ఆడిందో చెప్పవచ్చు. ఆర్ఆర్ఆర్ తో దంగల్ ని క్లోజ్ చెయ్యాలని భావించినా కూడా కనీసం సెకండ్ ప్లేసులో లో ఉన్న తన బాహుబలి 2 దారిదాపుల్లోకి కూడా వెళ్ళలేకపోయాడు జక్కన్న.దీంతో 'దంగల్' సినిమా రికార్డును చెరిపేసే బాధ్యత ఇప్పుడు మన టాప్ హీరో సూపర్ స్టార్ మహేష పై పడింది. మళ్లీ ఆ ఛాన్స్ రాజమౌళినే తీసుకోవాల్సి వచ్చింది. ఈ కాంబినేషన్ లో సినిమా ప్రకటించగానే ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


ఆప్రికన్ ఆడవుల నేపథ్యంలో తెరక్కిస్తున్న సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని అంతా ఎగ్జైట్ మెంట్ తో కోట్లాదిమంది మహేష్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా టార్గెట్ దాదాపు ఫిక్స్ అయినట్లే. ఈ సినిమాతో దంగల్ రికార్డులు బద్దలు కొట్టి నెంబర్ 1 ఇండియన్ సినిమాగా నిలబెట్టాలని రాజమౌళి గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఇక మహేష్ బాబు సినిమా అంటే హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా ఎంత రొటీన్ కథతో అయినా 200 కోట్ల పైగా వసూళ్లు రాబడుతుంది. ఇక రాజమౌళి లాంటి దర్శకుడు పాన్ వరల్డ్ లాంటి కథ అయితే ఇక రికార్డులన్నీ మహేష్ బాబు కాళ్ళ కింద వచ్చి పడతాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ ని ఒక చిన్న టీజర్ ద్వారా ప్రకటించబోతున్నాడట జక్కన్న. ఫ్యాన్స్ కోసం పెద్దగానే ప్లాన్ చేసాడట. ఆ టీజర్ తోనే భారీ అంచనాలు పెంచేసే ప్లాన్ లో ఉన్నాడట రాజమౌళి. ఈ సినిమాని దాదాపు 1000 కోట్లతో సీనియర్ నిర్మాత కె ఎల్ నారాయణ నిర్మించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: