తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపిస్తూ నెంబర్ వన్ కామెడీ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. దీని వల్ల ఎంతో మంది ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చారు.అందులో చాలా మంది తమ టాలెంట్లను చూపించుకుని బిగ్ సెలెబ్రిటీలుగా మారారు. అలాంటి వారిలో కమెడియన్ కెవ్వు కార్తీక్ ఒకడు. చాలా ఏళ్లుగా జబర్ధస్త్ షోలో యమ హైలైట్ అవుతూ దూసుకుపోతోన్న ఈ కుర్రాడు.. ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా కెవ్వు కార్తీక్ ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది. దీంతో బుల్లితెరలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ పూర్తి వివరాల్లోకి వెళితే.
జబర్ధస్త్‌లో తనదైన కామెడీతో విశేషమైన గుర్తింపుతో పాటు మంచి పేరు తెచ్చుకున్న కెవ్వు కార్తీక్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఈ కమెడియన్ తల్లి అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. దీంతో కెవ్వు కార్తీక్‌తో పాటు అతడు చేస్తోన్న జబర్ధస్త్ ఫ్యామిలీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆమె మరణంపై పలువురు బుల్లితెర ప్రముఖులు సంతాపం తెలిపారు

జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ తల్లి కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. దాదాపు 5 ఏళ్లకు పైగానే ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆమె కోలుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ మధ్యన కెవ్వు కార్తీక్ తల్లి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ నేపథ్యంలోనే ఆమె బుధవారం రాత్రి ప్రాణాలు కోల్పోయార గతంలో కెవ్వు కార్తీక్ మదర్ పలుమార్లు బుల్లితెరపై కనిపించారు. ఆమెకు క్యాన్సర్ అని నిర్ధారణ అయిన తర్వాత కూడా చాలా సార్లు షోలు, ఈవెంట్లలో పాల్గొన్నారు. దీంతో ఆమెకు పూర్తిగా బాగు అయిందని అందరూ అనుకున్నారు. కానీ, ఈ మధ్య కెవ్వు కార్తీక్ వరుసగా తన తల్లి ఆరోగ్యం గురించి పోస్టులు చేస్తున్నాడు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్ధించమని వేడుకున్నాడు.

తన తల్లి మరణ వార్తను కెవ్వు కార్తీక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపాడు. ఈ మేరకు తన ఖాతాలో 'అమ్మ.. గత 5 సంవత్సరాల 2 నెలలుగా కాన్సర్‌పై అలుపెరుగని పోరాటం చేశావు. నీ జీవితం అంతా యుద్ధమే. మమ్మల్ని కన్నావు నాన్నకు తోడుగా కుటుంబాన్ని కష్టపరిస్థితుల్లో కూడా కంటికి రెప్పలా కాపాడవు. అమ్మ ఈ ఐదేళ్లలో ఎలా ఒంటరిగా పోరాడాలి అని నేర్పావు' అని చెప్పాడు.అదే పోస్టులో కెవ్వు కార్తీక్ 'అమ్మా.. నీ ఆత్మస్తర్యం నాలో ధైర్యాన్ని నిపింది. అన్ని నేర్పవు కానీ నువ్వు లేకుండా ఎలా బ్రతకాలో నేర్పలేదు ఎందుకు అమ్మ? తన కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. మా అమ్మకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ అందరికి నా పాదాభివందనం' అంటూ రాశాడు. దీంతో ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ కామెంట్లు చేస్తున్నారు.అదే పోస్టులో కెవ్వు కార్తీక్ 'అమ్మా.. నీ ఆత్మస్తర్యం నాలో ధైర్యాన్ని నిపింది. అన్ని నేర్పవు కానీ నువ్వు లేకుండా ఎలా బ్రతకాలో నేర్పలేదు ఎందుకు అమ్మ? తన కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. మా అమ్మకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ అందరికి నా పాదాభివందనం' అంటూ రాశాడు. దీంతో ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: