పాన్ ఇండియా స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌, ఇంకా యంగ్ డైరెక్టర్ బుచ్చి బాబు సాన కాంబోలో రూపొందబోతున్న సినిమాకు ఆస్కార్ అవార్డు విన్నర్ ఏ ఆర్ రెహమాన్ ను సంగీత దర్శకుడు అనగానే చాలామంది అయ్యో ఎప్పటికి ఈ సినిమా అయ్యేను అంటూ ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ రామ్ చరణ్‌ సినిమా కోసం రెహమాన్ అప్పుడే ఏకంగా మూడు పాటలు రికార్డ్‌ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది రెహమాన్ కెరీర్లోనే ఫాస్టెస్ట్ కంపోజిషన్ అట.ఇప్పటి దాకా బుచ్చి బాబు సినిమాలో కనీసం ఒక్క సన్నివేశం షూటింగ్‌ చేయలేదు. అయినా కూడా రెహమాన్‌ వద్ద నుంచి ఏకంగా మూడు పాటలు తీసుకున్నాడని సమాచారం అందుతోంది. రెహమాన్ కెరీర్‌ లో ఒక సినిమా షూటింగ్‌ ప్రారంభం అవ్వకుండా మూడు పాటలను ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం అయ్యి ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు సినిమాకు రెహమాన్ సంగీతం ప్రధాన ఆకర్షణ అవ్వడం ఖాయమని సమాచారం తెలుస్తుంది.


ఇంకా అదే సమయంలో రెహమాన్ సంగీతం వల్ల సినిమా ఆలస్యం అవ్వకపోవచ్చు అని కూడా చర్చ మొదలైంది. గేమ్‌ చేంజర్ సినిమా కోసం చాలా సమయం కేటాయించిన రామ్ చరణ్‌, తదుపరి సినిమా విషయంలో ఆలస్యం అవ్వకూడదని గట్టిగా భావిస్తున్నాడట. అందుకే రెహమాన్‌ వైపు నుంచి ఏమాత్రం ఆలస్యం అవ్వకుండా ఇప్పటికే పాటల రికార్డింగ్‌ మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. జూన్‌ నెలలో గేమ్‌ చేంజర్ సినిమా షూటింగ్‌ ను డైరెక్టర్ శంకర్ పూర్తి చేయబోతున్నాడు. ఆ వెంటనే బుచ్చి బాబు దర్శకత్వంలో చరణ్‌ తన కొత్త సినిమా షూటింగ్‌ లో జాయిన్ అవ్వబోతున్నాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్‌ తో రూపొందబోతున్న ఈ సినిమాలో రామ్‌ చరణ్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటించబోతున్న సంగతి తెల్సిందే. భారీ అంచనాల నడుమ ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందబోతుంది. వచ్చే ఏడాది సమ్మర్‌ కానుకగా ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం తెలుస్తుంది. చూడాలి ఈ సినిమా ఎలాంటి హిట్ ని నమోదు చేస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: