తెలుగు లేడీ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టు హేమ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. "కొంచెం ఇష్టం కొంచెం కష్టం" సినిమాలో ఈమె పండించిన కామెడీ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అందులో చూపించి నటనకు ఆమెకు నంది అవార్డు కూడా లభించింది. 1990 కాలం నుంచి ఆమె సినిమాల్లో నటిస్తూ వస్తోంది. 2014 నుంచి 2024 వరకు అంటే పదేళ్ల కాలంలో ఆమె 250 సినిమాల్లో నటించి తనకంటే బిజీ ఎవరూ ఉండరని నిరూపించింది. అయితే కెరీర్ పరంగా ఆమె లైఫ్ సాఫీగానే సాగుతోంది కానీ పర్సనల్ లైఫ్ మాత్రం ముళ్లపై నడకలాగా సాగుతోంది.

 దీని అర్థం వైవాహిక జీవితంలో గొడవలవుతున్నాయని కాదు ఆమె ఆఫ్ స్క్రీన్ లైఫ్ మాత్రమే బాగా ఎఫెక్ట్ అవుతుంది. చాలాసార్లు వివాదాల్లో చిక్కుకున్న హేమ ఇప్పుడు బెంగళూరు రేవ్ పార్టీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వెస్ట్ గోదావరి కి చెందిన ఈ తార ఇటీవల రేవు పార్టీలో ఉన్నట్లు బెంగళూరు పోలీసులు స్వయంగా ప్రకటించారు. దానివల్ల ఆమె బాగా వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె లవ్ స్టోరీ ఒకటి వెలుగులోకి వచ్చింది.

హేమ యాక్టింగ్ కెరీర్‌లో అడుగుపెట్టగానే ప్రేమాయణం మొదలుపెట్టింది. ఒక ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ ఎలా ప్రారంభమైందో కూడా ఆమె వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ, "నేను కెరీర్ తొలినాళ్లలో దూరదర్శన్‌లో పనిచేసేదాన్ని. ఆ సమయంలో నాకు సయ్యద్ జాన్ అహ్మద్ పరిచయం అయ్యాడు. అతడు దూరదర్శన్‌లో అసిస్టెంట్ గా, కెమెరా మెన్ గా వర్క్ చేసేవాడు. జోక్ ఏంటంటే ఆయన నన్ను కలిసిన మొదటి సమయంలో పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అప్పటికి నాకింకా 20 ఏళ్లు కూడా రాలేదు. ఇంచుమించు 19 ఏళ్ల వయసు ఉంటుంది. కలిసిన వెంటనే మ్యారేజ్ చేసుకుందామని అడగడంతో అతడు మోసం చేసేవాడు కాదని నాకు నమ్మకం కలిగింది. అందుకే ఎస్ చెప్పేసా. వెంటనే అతడు మాటిచ్చినట్లుగానే నన్ను పెళ్లి చేసుకున్నాడు. మా ఇద్దరికీ ఈషా అనే బిడ్డ పుట్టింది." అని చెప్పుకొచ్చింది.

ఇప్పుడు హేమ లవ్ స్టోరీ బాగా వైరల్ అవుతుంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టగానే వెంటనే కెమెరామ్యాన్ ను తగులుతుందిగా ఈ ముద్దుగుమ్మ అంటూ కొంతమంది ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏది ఏమైనా హేమ అనవసరమైన వివాదాల్లో చిక్కుకోకుండా ఉండాల్సిన అవసరం ఉందని కొంతమంది హితవు పలుకుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: