క్యూట్ బ్యూటీ త్రిష ఈ మధ్య ఎటువంటి వ్యాఖ్యలు చేసినా సోషల్ మీడియాలో తీవ్రమైన వైరలవుతున్నాయి. ప్రధానంగా తన మొదటి ఇన్నింగ్స్ లో తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో ఏకఛత్రాధిపత్యాన్ని ఏలింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ లో కూడా ఎదురులేకుండా పోతోంది. త్రిషను చూస్తే ఎవరికైనా 41 సంవత్సరాల వయసంటే ఎవరూ నమ్మరు. ఒకప్పుడు అందం గురించి చెప్పాలంటే ఐశ్వర్యారాయ్ గురించి చెప్పేవారు. కానీ ఆ ఐశ్వర్యారాయ్ కూడా త్రిష ముందు తీసికట్టు. అంతలా తన గ్లామర్ రోజురోజుకు పెరుగుతోంది.ఒక్కరోజైనా మగాడిలా బతకాలి తాజాగా త్రిష చేసిన కామెంట్స్ ఆమె పేరును మరోసారి ట్రోల్ అయ్యేలా చేస్తున్నాయి. ఒక్కరోజైనా సరే మగాడిలా ఉండాలి అని వ్యాఖ్యానించింది. తన విచిత్రమైన కోరికను బయటపెట్టడం అనేది పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. మొదటి నుంచి త్రిష ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతుంది అనే విషయం తెలిసిందే. ఎటువంటి బోల్డ్ కామెంట్స్ అయినా నిర్మొహమాటంగా చేస్తుంది. మగాడి శరీర రూపకల్పన, అతని మానసిక స్థితిని తెలుసుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ విషయాన్ని తాను ఎప్పుడూ అమ్మతో చర్చిస్తుంటానని, పదే పదే చెబుతుంటానని, కానీ అమ్మ మాత్రం నవ్వుకొని వెళ్లిపోతుందని త్రిష చెప్పింది.నాగార్జున 100వ సినిమాలో.. త్రిష తన కోరికను బయటపెట్టడంతో సోషల్ మీడియాలో ఆమెను అభిమానులు ఒక రేంజ్ లో మండిపడుతున్నారు. కామెంట్లు కూడా చిత్రంగా పెడుతున్నారు. వెళ్లి సర్జరీ చేయించుకో అని ఒక నెటిజన్ సలహా ఇచ్చాడు. మరికొందరు మాత్రం నువ్వు ఇప్పుడు ఏమీ తీసిపోవు.. మగాడిలానే ఉన్నావు అంటూ ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటోంది త్రిష. నాగార్జున 100వ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త వైరలగా మారింది. నాగార్జున తన వందో సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకు తగ్గట్లుగా కథల ఎంపికతోపాటు నటీనటుల ఎంపిక, సాంకేతిక నిపుణుల ఎంపిక చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: