సాధారణంగా గ్లామర్ ఫీల్డ్ నుంచి పాలిటిక్స్ లోకి వెళ్లడం మనం చూస్తుంటాం.. కానీ సీన్ రివర్స్ అయితే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైసిపి సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇప్పుడు వెండితెరపై మెరవడానికి సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు. ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ‘పూనకాలు’ తెప్పిస్తున్నాయి ..


ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు అంబటి రాంబాబు చాలా కూల్ గా, అదే సమయంలో ‘మాస్’ గా సమాధానం ఇచ్చారు. "సినిమాల్లో నటించడం తప్పేమీ కాదు కదా! నా వయసుకి, నా హోదాకు తగినట్లుగా.. ఒక గౌరవప్రదమైన, హుందైన పాత్ర వస్తే నేను ఖచ్చితంగా నటిస్తాను" అని అంబటి స్పష్టం చేశారు.ఇప్పటివరకు సినిమా నుంచి రాజకీయాలకు రావడం చూశాం.. కానీ నేను రాజకీయాల నుంచి సినిమా రంగంలోకి ప్రవేశించడానికి రెడీ అని ఆయన చెప్పడం విశేషం ..



అంబటి రాంబాబు తన విశ్లేషణను కూడా జోడించారు. మన దేశంలో సినిమా, రాజకీయం అనేవి విడదీయలేని రంగాలని, రెండింటికీ ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.గతంలో కూడా అంబటి రాంబాబు తన వాక్చాతుర్యంతో, పంచ్ డైలాగులతో అసెంబ్లీలోనూ, ప్రెస్ మీట్లలోనూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండేవారు. ఇప్పుడు అదే ఎనర్జీని వెండితెరపై చూపిస్తానంటున్నారు.ఇప్పటికే ఆయన వేసిన స్టెప్పులు, ‘సంక్రాంతి’ డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశాయో తెలిసిందే .. ఇప్పుడు ఏకంగా ‘యాక్షన్’ చెప్పించుకోవడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఫిల్మ్ నగర్ లో కూడా చర్చకు దారితీసింది.అంబటి రాంబాబు గారి ఈ ప్రకటన చూస్తుంటే.. భవిష్యత్తులో ఏదైనా క్రేజీ ప్రాజెక్ట్ లో ఆయనను ‘మాస్’ క్యారెక్టర్ లో చూసే అవకాశం ఉందేమో అనిపిస్తోంది ..

మరింత సమాచారం తెలుసుకోండి: