తమిళనాడులో రాబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది. ఈసారి తమిళనాడు రాష్ట్రంలో త్రిముఖ పోరు చాలా స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. డీఎంకే, అన్నాడీఎంకేలతో పాటుగా,టీవీకే పార్టీ ఈసారి బరిలో నిలవనుంది.అయితే టీవీకే పార్టీతో పొత్తు కోసం ఇతర పార్టీలు పొత్తు చేసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయని చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాల పైన ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు కూడా క్లారిటీ ఇచ్చారు.


అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి మాజీ సీఎం ఎడప్పాడికే పళనియస్వామి తాజాగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. విజయ్ టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని తోసిపొచ్చారు. ఈ పొత్తు కేవలం ప్రచార మీడియా ఊహాగానాలు మాత్రమే అని తనకు బిజెపి నేత అన్నామలై తో ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. మీడియానే తమ మధ్య చాలా చీలికలు సృష్టిస్తోందని, మార్చి 17న కోయంబత్తూరులో జరగనున్న ఒక నిరసన ప్రదర్శనకు తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, అన్నా డీఎంకే నేత ఎస్పీ వేలు మనీతో కలిసి తాను కూడా అధ్యక్షత వహించనున్నానని తెలియజేశారు.

టీవీకే పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరుతుందా? అనే విషయం పైన కూడా మీడియా ప్రశ్నించగా నేను దీనిపైన ఇప్పటికే ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చాను ఇప్పటివరకు మేము (టీవీకే) పార్టీతో ఎటువంటి చర్చలు జరపలేదని అలాంటప్పుడు పొత్తు ఎలా కుదురుతుంది ఇవన్నీ కేవలం మీడియా రూమర్సు మాత్రమే వీటిని పెద్దది చేసి చూపిస్తున్నారు. అనవసరమైన ప్రచారం చేస్తున్నారని తెలియజేశారు. ఆ పార్టీతో అన్నాడీఎంకేకు ఎటువంటి సంబంధం లేదని పొత్తు కోసం మేము ఎప్పుడూ కూడా ఎవరిని సంప్రదించలేదు అంటూ తెలియజేశారు. తమిళ ఎన్నికలలో ఎన్డీఏ కూటమికి, అన్నా డీఎంకే నేతృత్వం వహిస్తుందని, టిటీవీ దినకరన్ తో తమకు మంచి సంబంధాలు ఉన్నాయనిఈ ఎన్నికలలో కచ్చితంగా ఇద్దరం కలిసి గెలవడానికి కృషి చేస్తున్నామని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: