నవ మన్మధుడు అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన "నా సామిరంగ" సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ద్వారా విజయ్ బిన్ని డైరెక్టర్ గా పరిచయమయ్యారు. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నాగార్జున మరో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా నవ మన్మధుడు అక్కినేని నాగార్జున  ముంబై ఏర్పోర్ట్ నుంచి బయటకి వస్తున్న సమయంలో అనుకొని ఘటన ఒకటి జరిగింది. ఎప్పుడు సినిమాలలో నటించే హీరోలు 

  ఒకసారిగా అభిమానుల ముందు వెళ్తుంటే ఆ ఆనందాన్ని తట్టుకోలేక వాళ్లతో సెల్ఫి దిగడానికి వెళ్తూ ఉంటారు ఫ్యాన్స్. అయితే సినీ సెలబ్రిటీల బాడీగార్డులు, బౌన్సర్లు చూపించే అత్యుత్సాహం అంతా ఇంతా కాదు. ఇప్పుడు నవ మన్మధుడు అక్కినేని నాగార్జున   విషయంలో కూడా అదే జరిగింది. ముంబై ఎయిర్ పోర్టులో నుంచి  బయటికి వస్తున్న సమయంలో నాగార్జున తో సెల్ఫీ దిగేటందుకు వచ్చిన అభిమానిని  గమనించిన బాడీగార్డ్ క్షణంలో ఆ వ్యక్తిని పక్కకి లాగేసాడు ఒకటేసారి ఆయన కింద పడేంత పని అయింది.తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ

 వైరల్ అవుతోంది. నెటిజన్స్ అంతా ని మానవత్వం ఏమైంది అంటూ నవ మన్మధుడు అక్కినేని నాగార్జున పై ఫైర్ అవుతున్నారు. అయితే ఈ సంఘటన జరిగే సమయంలో నాగార్జున దానిని గమనించలేదు కానీ ఈ వీడియో చూసిన తర్వాత ఆయన ఈ విషయం పై స్పందించారు. ఆయన సోషల్ మీడియాలో తాజాగా ఒక పోస్ట్ చేశారు అదేంటంటే. "ఈ ఘటననీ నేను ఇప్పుడే చూస్తున్నాను. ఇది అసలు జరిగి ఉండాల్సింది కాదు నేను నా అభిమానికి క్షమాపణలు చెబుతున్నారు. ఇలాంటిది మరోసారి జరగకుండా ఉండేందుకు నేను తగిన చర్యలు తీసుకుంటాను". అంటూ చెప్పుకొచ్చారు నాగార్జున.

మరింత సమాచారం తెలుసుకోండి: