ఇండస్ట్రీ జనాలకు కొసరాజు హరికృష్ణ అంటే ఎవరో తెలియకపోయినా ఎన్టీఆర్ ఆర్ట్స్ హరి అంటే మాత్రం బాగా తెలుసు. కొసరాజు హరికృష్ణ కళ్యాణ్ రామ్ బావమరిది కాగా ఎన్టీఆర్ ఆర్ట్స్ కు సంబంధించిన అన్ని పనులను ఆయనే చూసుకుంటున్నారు. సినిమాల బడ్జెట్ శృతి మించకుండా చేయడంలో అదే సమయంలో సినిమాలకు సంబంధించి క్వాలిటీ ఔట్ పుట్ రావడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.
అలాంటి హరికృష్ణ గురించి కొంతమంది మిస్ అండర్ స్టాండింగ్ చేసుకోవడంతో జూనియర్ ఎన్టీఆర్ ఓపెన్ గా ఇలాంటి కామెంట్లు చేశారు. కొసరాజు హరికృష్ణ మీడియాకు, ఇండస్ట్రీకి సంబంధించిన ఫంక్షన్లకు సైతం దూరంగా ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ ఆవేశం వెనుక అసలు కారణాలు వేరు అని ఆ కామెంట్స్ అర్థం కావాల్సిన వాళ్లకు అర్థం అయ్యాయని తెలుస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ హరిని ఇంతలా నమ్మారంటే ఆయన ప్రతిభ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది ఎన్టీఆర్ కు హరికి గ్యాప్ క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేసిన నేపథ్యంలో నందమూరి హరి గురించి అలాంటి పొరపాట్లు జరగకుండా తారక్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని ఫ్యాన్స్ ఫీలవుతుండటం గమనార్హం. దేవర1 సక్సెస్ సాధించిన నేపథ్యంలో దేవర సీక్వెల్ ను సైతం వేగంగా సెట్స్ పైకి తీసుకెళ్లాలని తారక్ భావిస్తున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న తారక్ బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.