అయితే ఒకప్పుడు ఈమె ఆల్కహాల్ కు బానిస అయ్యారట .. పలు మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం మనిషా తన జీవిత పుస్తకంలో ఆల్కహాల్ వ్యసనం గురించి రాసుకో వచ్చిందట .. ఆల్కహాల్ తన శరీరాన్ని ఎలా ప్రభావితం చేసిందో అందులో ఆమె నిక్కచ్చిగా వివరించారట. అలాగే మరో బాలీవుడ్ నటుడు ఫర్దిన్ ఖాన్ మన భారతదేశంలో నిషేధిత డ్రగ్స్ వాడకాలతో వార్తల్లో నిలిచాడు. ఫర్దిన్ ఖాన్ దగ్గర డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న తర్వాత అరెస్టు అయ్యాడు .. మీడియా నివేదికల ప్రకారం 2001లో మాదకద్రవ్యాల వ్యసనం నుంచి బయటపడడానికి హాస్పటల్ లో ట్రీట్మెంట్ కు వెళ్లి వచ్చాడట. అలాగే ప్రముఖ రాప్ సింగర్ హనీ సింగ్ బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చాడు .. ఆయన కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలోనే డ్రాగ్స్ , ఆల్కహాల్కు హనీ సింగ్ బానిస అయ్యాడని తెలుస్తుంది .. అలాగే హనీ సింగ్ కొంతకాలం మీడియాకు సినిమాకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇలా మాదక ద్రవ్యాల వ్యసనం నుంచి బయటపడేందుకు హనీ సింగ్ రిహాబిలిటేషన్ తీసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో పలు వార్తలు వచ్చాయి.
అలాగే బాలీవుడ్ స్టార్ కమెడియన్ నటుడు కపిల్ శర్మ తన కామెడీతో ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు .. అయితే ఆయన కెరియర్ మంచి పిక్స్ లో ఉన్న సమయంలోనే మద్యానికి బానిస అయ్యారట .. ఈ ప్రభావం అతని కేరీర్‌పై కూడా ప్రభావం చూపించిందట. ఇక కపిల్ మద్యం వ్యసనం నుంచి బయటపడేందుకు రిహాబిలిటేషన్ లో కొంతకాలం గడిపినట్లు కొన్ని మీడియా సంస్థలు చెప్పవచ్చాయి. గత 15 ఏళ్లుగా తాను మద్యానికి బానిసయ్యానని, తన కెరీర్ కూడా మద్యానికి బానిసైందని ప్రముఖ నటుడు ధర్మేంద్ర 2012 లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పి ఒప్పుకున్నారు . నటుడు, రచయిత జావేద్ అక్తర్ ఒక ఇంటర్వ్యూలో తన మద్య వ్యసనం గురించి చెప్పారు. “ప్రజలు తరచుగా దేనికీ చింతించరని చెబుతారు, కానీ నేను చాలా విషయాలకు చింతిస్తున్నాను. నేను నా జీవితంలో 10 సంవత్సరాలు తాగుతూ గడిపాను. ఆ సంవత్సరాలు నేను ఏదైనా మంచి పని చేసి ఉంటే బాగుండేది” అన్న అర్థంలో జావేద్ అక్తర్ తెలిపారు. ఇలా బాలీవుడ్లో మధ్యానికి, డ్రగ్స్ కు బానిసైన నటులు వీరే కాకుండా ఇండియన్ చిత్రపరిశ్రమలో ఎందరో ఉన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి