ప్రభాస్ హీరోగా చేసిన సాహో మూవీలో బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా చేసిన సంగతి మనకు తెలిసిందే.తండ్రి వారసత్వంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా కపూర్ ఆషీక్యూ 2 అనే సినిమా ద్వారా బాలీవుడ్ లో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఈ సినిమా తర్వాత ఈమె చేసిన ఎన్నో సినిమాలు హిట్ అయ్యి శ్రద్ధా కపూర్ తండ్రి పేరుని వాడుకోకుండా ఎదిగిపోయింది. అయితే అలాంటటి ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది నటించిన స్త్రీ 2 మూవీ ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో చెప్పనక్కర్లేదు.ఇక ఈ సినిమాలో నటించిన శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కి ఉండే ఫాలోయింగ్ ని సైతం దాటేసింది. ఆయనకంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ని సంపాదించుకొని సత్తా చాటింది.

 అలా ఓవైపు సినిమాల్లో మరోవైపు సోషల్ మీడియాలో ఒక్కసారిగా హైలైట్ అయిన ఈ ముద్దుగుమ్మ చాలా రోజుల నుండి రాహుల్ మోడీతో ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈ హీరోయిన్ రాహుల్ మోడీకి బ్రేకప్ చెప్పి హాలీవుడ్ హీరో తో ప్రేమలో పడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఇంతకీ ఆ హాలీవుడ్ హీరో ఎవరయ్యా అంటే ఆండ్రూ గ్యార్ ఫీల్డ్.. ఈయన ది అమేజింగ్ స్పైడర్ మాన్ అనే సిరీస్ ద్వారా ఫేమస్ నటుడిగా మారిపోయారు.అలా హాలీవుడ్ ఫేమస్ నటుడు అయినటువంటి ఆండ్రు గ్యార్ ఫీల్డ్ తో తాజాగా హీరోయిన్ శ్రద్ధ కపూర్ కనిపించింది.
అయితే వీరిద్దరూ సన్నిహితంగా దిగిన ఫోటో నెట్టింట వైరల్ గా మారడంతో రాహుల్ మోడీకి బ్రేకప్ చెప్పి హాలీవుడ్ నటుడితో శ్రద్ధా కపూర్ సెట్ అయిపోయింది. హాలీవుడ్ నటుడితో డేటింగ్ చేస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో శ్రద్ధ కపూర్ డేటింగ్ వార్తలు మీడియాలో హాట్ టాపిక్ గా మారడంతో కొంతమందిని నెటిజన్స్ ఈ వార్తలు నిజమే అంటే మరి కొంతమందేమో ఎవరు ఊహించని కలయిక వీరిది.. ఒకవేళ వీరు డేటింగ్ చేస్తున్నారా లేక ఏదైనా కొత్త సినిమాను ప్లాన్ చేస్తున్నారా తెలియాల్సి ఉంది అంటూ సోషల్ మీడియాలో క్వశ్చన్ మార్కు తో పెడుతూ పోస్టులు చేస్తున్నారు. మరి వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారా లేక కొత్త సినిమా ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అనేది క్లారిటీ ఇవ్వాల్సి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: