టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఎన్నో చిత్రాలలో నటించారు. అయితే అందులో కొన్ని మాత్రమే సక్సెస్ అవ్వగా మరికొన్ని డిజాస్టర్ గా మిగిలాయి. దీంతో సినిమా అవకాశాల కోసం ఇతర చిత్రాలలో కూడా పలు కీలకమైన పాత్రలలో  నటిస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా మజాకా అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సమయంలో విభిన్నంగా ప్రమోషన్స్ సైతం చేస్తూ ఉన్నారు చిత్ర బృందం. డైరెక్టర్ త్రినాధరావునక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా హీరోయిన్గా రీతు వర్మ నటించగా కీలకమైన పాత్రలో అన్షు అంబానీ నటిస్తూ ఉన్నది.


ఇందులో సీనియర్ నటుడైన రావు రమేష్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తూ ఉన్నారట. దీంతో  మజాకా చిత్రం పైన భారీగా అంచనాలు ఏర్పడడంతో బాక్సాఫీస్ టార్గెట్ ఎంత అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారుతున్నది. ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మజాకా చిత్రం థియేటర్ బిజినెస్ గురించి వార్తలు వినిపిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా హక్కులను రూ .9 కోట్ల రూపాయలకు అమ్మరట.. ప్రపంచవ్యాప్తంగా 11 కోట్లకు పైగా ఫెయిల్ అయినట్లు టాకు వినిపిస్తోంది.


ఇప్పటికే డిజిటల్ తో పాటు శాటిలైట్ హక్కులను కూడా ప్రముఖ ఎంటర్టైన్మెంట్ సంస్థ Zee గ్రూప్ దక్కించుకున్నదట. ఈ సినిమా థియేటర్లో విడుదలైన తరువాత నెలకి మార్చి 26 న ఓటిటీ లో రాబోతుందని టాక్ వినిపిస్తోంది. సందీప్ కిషన్ 30వ సినిమా గా మజాకా సినిమా రిలీజ్ చేయబోతున్నది .మరి చిన్న టార్గెట్ ని సందీప్ కిషన్ ఏవిధంగా అందుకొని సక్సెస్ అవుతారో చూడాలి ఇటీవలే వరుస ఇంటర్వ్యూలలో కూడా పాల్గొన్న సందీప్ కిషన్ సినిమా ప్రమోషన్స్ని విభిన్నంగా ఆలోచిస్తూ చేస్తూ ఉన్నారు. మరి ఏ మేరకు సందీప్ కిషన్ కి ఈ సినిమా సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: