మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉపాసన వ్యాపారవేత్తగా ఎన్నో విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు ఎన్నో పురస్కారాలను సైతం అందుకున్నారు. చరణ్ భార్యగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా పాపులారిటీ పెరగగా వివాదాలకు దూరంగా ఉంటూ ఆమె ప్రశంసలు అందుకుంటున్నారు. ఉపాసన తన వంతు సేవా కార్యక్రమాలు సైతం చేస్తున్నారనే సంగతి తెలిసిందే.
 
ఉపాసన సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఆమె సోషల్ మీడియా వేదికగా చేసే ప్రతి పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఉపాసన ఆస్తుల విలువ వేల కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది. ఉపాసన ఆస్తుల విలువ ఏకంగా 1130 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. ఉపాసన తన ప్రతిభతో ఈ రేంజ్ లో ఆస్తులు సంపాదించారని తెలుస్తోంది.
 
క్లీంకార లేటెస్ట్ ఫోటోలు సైతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉమెన్స్ డే కాగా ఉమెన్స్ డే సందర్భంగా నెటిజన్లు, మెగా అభిమానులు ఉపాసనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఉపాసన కెరీర్ పరంగా ఎన్నో విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఉపాసన చరణ్ కెరీర్ కు సైతం తన వంతు సపోర్ట్ చేస్తున్నారు.
 
రామ్ చరణ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా ఈ సినిమా ఒకింత భారీ స్థాయిలోనే తెరకెక్కుతోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండటం గమనార్హం. రామ్ చరణ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ పెరుగుతుండగా ఈ హీరో మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రామ్ చరణ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో బిజీ కావాలని ఈ హీరో అభిమానులు కోరుకుంటున్నారు.


 
 


మరింత సమాచారం తెలుసుకోండి: