టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ సరైన విజయం కోసం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా వెంకటేష్ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులు అయినటువంటి ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాతో వెంకటేష్ ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో వెంకటేష్ తన తదుపరి మూవీ లపై ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా అనేక మంది రచయితలను , దర్శకులను కలుస్తూ వాళ్ళు చెబుతున్న కథలను వింటూ వస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా వెంకటేష్ ఏదైనా ఒక కథ ఓకే అయినా కూడా వెంటనే ఆ సినిమాను ఓకే చేసే ఉద్దేశంలో లేనట్లు తెలుస్తోంది. ఆయన ఏదైనా సినిమా ఓకే అయినా కూడా రెండు , మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోబోతున్నట్లు , ఆ తర్వాతే సినిమాను మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో జోష్ లో వెంకటేష్ మరో ఒకటి , రెండు సినిమాలను ఓకే చేస్తాడు అని ఆయన అభిమానులు భావించారు. కానీ వెంకటేష్ మాత్రం చాలా స్లో గా , స్టడీగా సినిమాలను ఓకే చేస్తూ ముందుకు వెళ్లాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఏదేమైనా సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వెంకటేష్మూవీ ఓకే చేసిన , ఏ దర్శకుడితో సినిమా చేసిన దాని పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: