త్రిష కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన థగ్ లైఫ్ మూవీ జూన్ 5న  పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతోంది. డైరెక్షన్లో రాబోతున్న థగ్ లైఫ్ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే గత కొద్ది రోజుల నుండి మణిరత్నం డైరెక్షన్లో మ్యాజిక్ మిస్ అవుతుంది అని పలువురు మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే థగ్ లైఫ్ మూవీతో మాట్లాడటం మళ్ళీ కమ్ బ్యాక్ అవుతారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు చిత్ర యూనిట్. కమల్ హాసన్, త్రిష, అశోక్ సెల్వన్, శింబు లు హాజరయ్యారు.అయితే ఆ ఇంటర్వ్యూలో భాగంగా వీరి గురించి యాంకర్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు అడిగి తెలుసుకుంది. అలాగే త్రిషని మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి.. మీ హాబీస్ ఏంటి అని అడగగా..నాకు ఉడకబెట్టిన అరటి పండ్లు తినడం అంటే ఎంతో ఇష్టం దాని పేరు ఏమో ఉంటుంది అని ఆ పేరు గుర్తుకు రాకపోవడంతో కాస్త కన్ఫ్యూజ్ అయింది. 

అయితే త్రిష పక్కనే కూర్చున్న కమల్ హాసన్ పయం పూరి అంటూ దాని పేరు చెప్పారు. హా అవును పయంపూరి అంటే నాకు ఇష్టం. కాని పేరు గుర్తుకు రాలేదు అన్నట్లుగా త్రిష చెప్పింది.అయితే ఇదంతా బాగానే ఉన్నప్పటికీ త్రిష చెప్పిన మాటలకు కమల్ హాసన్ ఇచ్చిన ఆన్సర్ మాత్రం చాలా మందికి నచ్చడం లేదు. మరి ఇంతకీ కమల్ హాసన్ ఏమన్నారంటే అరటిపండు నోట్లో పెట్టుకోవడం తెలుసు కానీ దాని పేరు మాత్రం తెలియదా అంటూ మాట్లాడడంతో చాలామంది షాక్ అయిపోయారు. అయితే కమల్ హాసన్ నేచురల్ గానే అన్నప్పటికీ అక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్ రావడంతో కమల్ హాసన్ మాటలని చాలామంది ట్రోల్ చేస్తున్నారు. అయితే కమల్ హాసన్ అన్న మాటలకి అక్కడున్న వాళ్ళందరూ నవ్వేసరికి కమల్ హాసన్ ఇదంతా సరదాగా అన్నానులే అన్నట్లుగా త్రిషని చేయితో తట్టారు.

అయితే ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్లు కమల్ హాసన్ ని తిట్టిపోస్తున్నారు. కనీసం స్టేజ్ మీద ఎలా మాట్లాడాలి అనేది కూడా తెలియదా..ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగులు అవసరమా.. ఇంత ఏజ్ వచ్చినా కూడా ఎక్కడ ఎలా మసులుకోవాలో తెలియదా అంటూ ఫైర్ అవుతున్నారు.కానీ మరి కొంత మంది మాత్రం అక్కడ కమల్ హాసన్ మాట్లాడిన దాంట్లో తప్పేముంది.. ఫ్లోలో అలా అన్నారు.ఆయన అరటిపండు గురించి ఉన్నదే చెప్పారు.కానీ మీరే ఏదో డబుల్ మీనింగ్ డైలాగులు ఊహించుకుంటున్నారు. కమల్ హాసన్ మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు అంటూ కొంతమంది ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: