సీనియర్ నటి సాక్షి శివానంద్ ఇప్పటి తరం ప్రేక్షకులకు కూడా తెలిసిన హీరోయిన్.. ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, నాగార్జున, బాలకృష్ణ, అర్జున్ సార్జా, మహేష్ బాబు, అబ్బాస్, రాజశేఖర్ వంటి స్టార్ హీరోలతో ఆడిపడింది. అయితే అలాంటి సాక్షి శివానంద్ స్టార్ హీరో తో గొడవలు పడి జీవితాన్ని నాశనం చేసుకుంది. మరి ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే మోహన్ బాబు.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు,సాక్షి శివానంద్ కాంబినేషన్లో యమజాతకుడు, కలెక్టర్ గారు వంటి రెండు సినిమాలు వచ్చాయి.అయితే ఈ సినిమాలు చేసే సమయంలో సాక్షి శివానంద్, మోహన్ బాబు తనతో అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ పలు ఆరోపణలు చేసింది.అంతేకాదు అంత పెద్ద హీరో పై సాక్షి శివానంద్ చేసిన వ్యాఖ్యలు ఎవరూ కూడా పట్టించుకోలేదు. ఈమె పైనే చెడు ముద్ర వేశారు. 

అలాగే మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు డెబ్యూ మూవీ అయినటువంటి విష్ణు సినిమాలో హీరోయిన్గా సాక్షి శివానంద్ చెల్లెలు శిల్పా శివానంద్ నటించింది.ఈ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ శిల్పా శివానంద్ ని మంచు విష్ణుతో లిప్ లాక్ సన్నివేశాన్ని చేయమని చెప్పారట.కానీ శిల్పా శివానంద్ మాత్రం దానికి ఒప్పుకోకపోవడంతో మోహన్ బాబు షూటింగ్ సెట్ కి వచ్చి శిల్పా శివానంద్ పై చేయి చేసుకున్నారనే వార్తలు కూడా వినిపించాయి. అంతేకాదు ఈ విషయం సాక్షి శివానంద్ కి తెలియడంతో ఆమె ఇండస్ట్రీలో రచ్చ రచ్చ చేసింది అని, ఫిలిం ఇండస్ట్రీలో కూడా కంప్లైంట్ ఇచ్చిందని,కానీ ఇండస్ట్రీలో పెద్దగా ఉన్న మోహన్ బాబు ని ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు అంతగా పట్టించుకోలేదనే రూమర్లు కూడా అప్పట్లో వినిపించాయి. అలా మోహన్ బాబుతో వైరం పెట్టుకొని సాక్షి శివానంద్ తన సినీ కెరియర్ మొత్తం పాడుచేసుకుంది.

అంతేకాకుండా మోహన్ బాబు పై పలు ఆరోపణలు చేసి టాలీవుడ్ లో ఉన్న కొన్ని అవకాశాలను కూడా దూరం చేసుకుని చివరికి టాలీవుడ్ ఇండస్ట్రీకే దూరమైంది. ఆ తర్వాత ఈ హీరోయిన్ ని తెలుగులో ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది. అయితే సాక్షి శివానంద్ ఏ హీరో అయితే గొడవలు పడిందో చివరికి ఆ హీరోనే ఆమెకు సహాయం చేశారట. అదేంటంటే సాక్షి శివానంద్ కొన్న భూమి వివాదంలో చిక్కుకున్న సమయంలో ఈ విషయం తెలుసుకున్న మోహన్ బాబు వెంటనే ఆ భూ సమస్యను క్లియర్ చేసి సాక్షి శివానంద్ కి సహాయం చేశారట.అయితే ఆయన చేసిన సహాయానికి సాక్షి శివానంద్ కృతజ్ఞత చెప్పడంతో పాటు తాను చేసిన గొడవలకి క్షమాపణలు కూడా తెలియజేసిందట..

మరింత సమాచారం తెలుసుకోండి: