
సంక్రాంతి కానుకగా ఎప్పుడు బడా సినిమా రిలీజ్ అయిన మా హీరో సినిమా బాగుంది అంటే మా హీరో సినిమా బాగుంది అంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తూ ఉంటారు . అయితే ఒక సినిమానే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంటుంది . కాగా పోయినసారి సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్.. డాకు మహారాజ్ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడ్డాయి. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. డాకు మహారాజ్ సినిమా కూడా మంచి టాక్ అందుకుంది .
కానీ గేమ్ ఛేంజర్ సినిమా మాత్రం ఫ్లాప్ అయ్యింది. పెద్ద హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సంక్రాంతి కానుకగా రిలీజ్ అయితే కచ్చితంగా హిట్ కొట్టాలి అన్న రూల్ ఏమీ లేదు .. కంటెంట్ ఏ సినిమా బాగుంటే ఆ మూవీ హిట్ అవుతుంది . కాగా ఈసారి సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి - బాలయ్యలు మరోసారి పోటీ పడబోతున్నారు అన్న వార్త అభిమానుల్లో కొత్త ఫీలింగ్ కలగజేస్తుంది. ఆల్రెడీ వాల్తేరు వీరయ్య అదే విధంగా వీరసింహారెడ్డి సినిమా టైంలో పోటీపడ్డారు . గతంలో ఎన్నోసార్లు సంక్రాంతి రేసులో ఇద్దరు హీరోలు పోటీపడ్డారు . అయితే మరొకసారి అదే విధంగా వీళ్లు నటించిన సినిమాలు సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలి అన్న ఆలోచన చేస్తూ ఉండడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.
ప్రజెంట్ బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు . ఈ సినిమా సంక్రాంతి కానుక విడుదల చేయాలి అంటూ ప్లాన్ చేస్తున్నారట మూవీ మేకర్స్ . ఆల్రెడీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇదే నిజమైతే మాత్రం ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి కానుకగా పోటీపడతాయి. ఏ సినిమా హిట్ అవుతుంది ఏ సినిమా తుస్సు మంటూ ఫ్లాప్ అవుతుంది అంటూ ఇప్పటినుంచే జనాలు మాట్లాడుకోవడం ప్రారంభించారు..!