స్టార్ బ్యూటీ అనుష్క అంటే చాలు ప్రేక్షక లో ఎంతో తీలని ఎగ్జిట్ మెంట్ ఉంటుంది .. ప్రేక్షకుల్లో తన సినిమాలతో అనుష్క క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది .. అయితే అనుష్క రెగ్యులర్గా సినిమాలు చేయకపోవడం కొంత ఆమె అభిమానులను ఇబ్బంది పెడుతుంది .  నిశ్శబ్దం మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా చేసింది .  ఇక ఈ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ అయింది .. ఇక ఈ సినిమా అయిన వెంటనే సినిమాలు చేస్తుందేమో అనుకుంటే మళ్ళీ స్వీటీ గ్యాప్ తీసుకుంది .


అయితే దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో అనుష్క ఘాటి అనే సినిమా చేసింది .. క్రిష్ రాసుకున్న కథకు అనుష్కనే పర్ఫెక్ట్ అనుకుని  ఆమె కాదన్నా సరే ఒప్పించి మరి సినిమా  చేశాడు .  అలాగే ఘాటీ సినిమా ఫస్ట్ లుక్ , టీజర్ అనుష్క అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది .  ఇక ఈ సినిమాతో స్వీటీ మళ్లీ తిరిగి ఫామ్ లోకి వస్తుందని అంతా అనుకున్నారు .  అలాగే అనుష్క సినిమా అనగానే బిజినెస్ కూడా భారీగా జరిగింది .  యువి క్రియేషన్స్ ఫస్ట్ ప్రైమ్ ఎంటర్టైన్మెంట్స్ లో కలిసి నిర్మిస్తున్న ఘాటీ సినిమా డిజిటల్ శాటిలైట్ రైట్స్ ఇప్పటికే అమ్ముడైపోయినట్టు తెలుస్తుంది .  అలాగే ఈ సినిమాకు ఒక మంచి ఫ్యాన్సీ డీల్ వచ్చిందని కూడా అంటున్నారు. ఇవే కాదు హిందూ థియేట్రిక‌ల్‌ రైట్స్ కూడా మంచి ధరకే అమ్ముడయ్యాట .  ఇక మన టాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు స్పెషల్ క్రేజ్‌ తెచ్చుకుంటాయి ముఖ్యంగా అనుష్క చేస్తున్న సినిమా అంటే దానికి చాలా ప్రత్యేకత ఉంటుంది .

అనుష్క చేసిన అరుంధతి సెన్సేషనల్ హిట్ .. అలాగే రుద్రమదేవి , భాగమతి సినిమాలు కూడా మంచి విజయాలు సాధించాయి .. సో వాటి దారిలోనే ఘాటి సినిమా కూడా అనుష్క స్టామినా ఏంటో చూపిస్తుందని అంటున్నారు .  ఇప్పటికే అనుష్క క్రిష్ వేదం సినిమా కలిసి చేశారు .  ఆ సినిమాలో అనుష్క సరోజ పాత్ర ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది .. అయితే ఇప్పుడు ఘాటీలో మాత్రం ఒక పోరాటం చేస్తే మహిళ క్యారెక్టర్లు అనుష్క కనిపించబోతుంది .. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అన్నది తెలియదు కానీ సరైన ప్రమోషన్స్ తో సినిమాను రిలీజ్ చేస్తే అనుష్క అభిమానులు ఈ సినిమాని సక్సెస్ చేస్తారని చెప్పవచ్చు .  ఇప్పటికే అనుష్క సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ తోనే బడ్జెట్లో సగానికి పైగా రికవరీ చేసిందని కూడా తెలుస్తుంది ..  ఇక థియేట్రికల్ బిజినెస్ తో నిర్మాతలకు లాభాలు అని కూడా చెప్పవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: