
భారీ ప్రాజెక్ట్ లతో పాటు చిన్న సినిమాలలో సైతం నటిస్తున్న అనన్య నగళ్ల కంటెంట్ బేస్డ్ సినిమాలలో ఎక్కువగా నటిస్తున్నారు. చదువు పూర్తైన తర్వాత సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసిన అనన్య నగళ్ల ప్రస్తుతం హీరోయిన్ గా సత్తా చాటుతూ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు. వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న అనన్య ఇన్ స్టా స్టోరీస్ లో చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
తాను ఫ్యాషన్ డిజైనర్ కోసం వెతుకుతున్నానని 0 - 6 సంవత్సరాల అనుభవం ఉన్న ఎవరైనా careers@maynao.in ఈమెయిల్ ఐడీకి రెజ్యూమ్ ను మెయిల్ చేయాలని అనన్య నగళ్ల కోరారు. దయచేసి డీఎం చేయవద్దని అనన్య నగళ్ల కోరారు. ఫ్యాషన్ డిజైనర్స్ కు అనన్య ఇచ్చిన బంపర్ ఆఫర్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. ఈ లక్కీ ఛాన్స్ దక్కించుకునే ఫ్యాషన్ డిజైనర్ ఎవరో చూడాల్సి ఉంది.
స్టార్స్ ప్రాజెక్ట్ లలో ఛాన్స్ దక్కితే అనన్య కెరీర్ మరింత పుంజుకునే ఛాన్స్ అయితే ఉంది. అనన్య నగళ్ల బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అనన్య నగళ్ల బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. అనన్య నగళ్ల భారీ విజయాలను సొంతం చేసుకుంటే ఆమె ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.