దర్శక ధీరుడు రాజమౌళి స్టార్ హీరో మహేష్ బాబుతో కలిసి సినిమాను తీస్తున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ 29 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఇందులో మహేష్ బాబు తన లుక్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. మహేష్ బాబుకు సంబంధించిన ఓ పోస్టర్ ను గత కొద్ది రోజుల క్రితమే చిత్ర బృందం రిలీజ్ చేయగా అందులో మహేష్ బాబు లుక్ అదిరిపోయింది. ఇందులో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది. 

ఈ సినిమాను పూర్తి స్థాయి అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి మేకింగ్ వీడియోలు, ఫోటోలు బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాను 2027 లో రిలీజ్ చేస్తామని రాజమౌళి ఓ సందర్భంగా వెల్లడించారు. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఎస్ఎస్ఎంబీ 29 సినిమాలో తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఓ కీలకపాత్రలో నటించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

దీనికోసం విక్రమ్ ను సంప్రదించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది. త్వరలోనే విక్రమ్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ కూడా నటిస్తున్నారు. బాగా ప్రస్తుతం మహేష్ బాబు నెలరోజుల పాటు బ్రేక్ తీసుకున్నారు. తన కుటుంబంతో కలిసి వెకేషన్ వెళ్లాలని నెల రోజులపాటు గ్యాప్ తీసుకున్నారు. తొందరలోనే మహేష్ బాబు సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: