తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్న నటులలో విజయ సేతుపతి ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాగే విజయ్ సేతుపతి సినిమాల్లో కేవలం హీరో పాత్రలలో మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో , కీలక పాత్రలలో , ముఖ్య పాత్రలలో ఇలా అనేక రకాలైన పాత్రలో నటించి తనదైన నటనతో ఎన్నో సినిమాలను హిట్ వైపు తీసుకువెళ్లను సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే విజయ్ సేతుపతి తెలుగులో కూడా పలు సినిమాలలో నటించాడు.

కొంత కాలం క్రితం చిరంజీవి హీరో గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సైరా నరసింహారెడ్డి సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించిన విజయ్ సేతుపతి , పంజా వైష్ణవ్ తేజ్ హీరో గా కృతి శెట్టి హీరోయిన్గా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఈ రెండు మూవీల ద్వారా కూడా తెలుగు సినీ పరిశ్రమలో విజయ్ కి మంచి గుర్తింపు వచ్చింది. అలాగే విజయ్ నటించిన అనేక సినిమాలు తెలుగులో డబ్ అయ్యి విడుదల అయ్యాయి. వాటి ద్వారా కూడా ఈయనకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ప్రస్తుతం విజయ్ సేతుపతి "ఏస్" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా మే 23 వ తేదీన విడుదల చేయనున్నట్లు. మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమాతో విజయ్ సేతుపతి ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో , ఏ రేంజ్ కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర రాబడతాడో తెలియాలి అంటే మే 23 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vs