మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముకేశ్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కిన కన్నప్ప సినిమా జూన్ నెల 27వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తమ్మారెడ్డి భరద్వాజకు ఇంటర్వ్యూ ఇచ్చిన విష్ణు ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. 2014 సంవత్సరంలో తనికెళ్ల భరణి గారు కన్నప్ప ఐడియ చెప్పారని విష్ణు అన్నారు.
 
ఐడియా నాకెంతో నచ్చిందని విదేశాల నుంచి నిపుణులను పిలిపించి దీనిని డెవలప్ చేయించానని విష్ణు కామెంట్లు చేశారు. కొన్ని నెలలకే నా అభిరుచిని గమనించి భారీ స్థాయిలో సినిమా చేయమన్నారని విష్ణు పేర్కొన్నారు. ఆ కథను తీసుకుని నా వెర్షన్ లో సిద్ధం చేయించానని 100 కోట్ల లోపు బడ్జెట్ అవుతుందని అనుకున్నానని విష్ణు తెలిపారు. అయితే ఈ సినిమాకు రెట్టింపు ఖర్చు అయిందని విష్ణు కామెంట్లు చేశారు.
 
ప్రభాస్ ఈ సినిమా విషయంలో నన్నెంతో ప్రోత్సహించారని విష్ణు అన్నారు. ప్రభాస్ కు తాను రుణపడి ఉంటానని ప్రభాస్ కెరీర్ లో రుద్ర రోల్ మైలురాయిగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు. నాన్నకు ప్రభాస్ కు మధ్య ఒక సీన్ ఉంటుందని సినిమాకు ఆ సీన్ హైలెట్ గా నిలుస్తుందని విష్ణు చెప్పుకొచ్చారు.
 
విజువల్ ఎఫెక్ట్స్ లో ప్రావీణ్యం లేని వ్యక్తిని తీసుకోవడం వల్ల మూవీ ఆలస్యమైందని ఇదే తాను చేసిన పెద్ద తప్పు అని విష్ణు అన్నారు. ఈ సినిమాను జూన్ నెల 27వ తేదీన రిలీజ్ చేయడానికి టీం ఎంతగానో కష్టపడుతోందని ఆయన వెల్లడించారు. మంచు విష్ణు చేసిన కామెంట్లు కన్నప్ప సినిమాపై అంచనాలను పెంచే విధంగా ఉన్నాయి. కమర్షియల్ గా ఈ సినిమా ఫలితం ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది. కన్నప్ప సినిమా పాన్ ఇండియా మూవీగా థియేటర్లలో రిలీజ్ కానుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: