సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా  ఒక హీరోతో సినిమా అనుకోని కథ రెడీ చేసిన తర్వాత ఆ హీరో రిజెక్ట్ చేయడం వలన లేదంటే డేట్స్ కుదరకనో మరో హీరో కి వెళ్లి సక్సెస్ అందుకున్న సందర్భాలు ఎన్నో చూస్తూ ఉంటాం   అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి డైరెక్షన్లో వచ్చినటువంటి ఆ సినిమాను ముందుగా ప్రభాస్తో చేయాలనుకున్నారట. కానీ ప్రభాస్ రిజెక్ట్ చేయడం వల్ల చివరికి అది జూనియర్ ఎన్టీఆర్ కు దక్కింది. ఆ సినిమా ఏంటి వివరాలు చూద్దాం.. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎవరయ్యా అంటే  చాలామంది రాజమౌళి నేనే చూపిస్తారు.. తెలుగు ఇండస్ట్రీలో గొప్ప గుర్తింపును సంపాదించుకొని రాజమౌళి తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచం నలుమూలల చూపించారు.

 అలాంటి రాజమౌళి బాహుబలి సినిమా రిలీజ్ ఈవెంట్ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు. ప్రస్తుతం ఆ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమౌళి మొదటిసారి చేసినటువంటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్. ఈ చిత్రాన్ని ముందుగా ప్రభాస్తో చేయాలని కథ కూడా రెడీ చేసి ఆయనకు వినిపించారట. కానీ ప్రభాస్ నో చెప్పడంతో అది కాస్త ఎన్టీఆర్ వద్దకు వెళ్ళింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వచ్చినటువంటి మరో సినిమా సింహాద్రి. ఈ మూవీ సమయంలో కూడా ప్రభాస్కి రాజమౌళి పోనిచేసి కథ వినడానికి రమ్మన్నాడట. నీకు కొన్ని కారణాలవల్ల ఈ కథ కూడా ఎన్టీఆర్ వద్దకే వెళ్లి సూపర్ హిట్ అయింది.

 అలా రెండు వరుస హిట్ల తర్వాత ప్రభాస్కి రాజమౌళి అంటే ఏంటో అర్థం అయింది. అప్పుడే మా ఇద్దరి కాంబినేషన్ లో అసలు సినిమా ఉంటుందా అని ప్రభాస్ అనుకున్నారట. కానీ చివరికి రాజమౌళి నీతో ఒక సినిమా చేస్తాను అని మాటిచ్చారట. ఆయన మాట ప్రకారమే ప్రభాస్తో  చత్రపతి సినిమా చేశారు. ఈ సినిమా ఎంతటి హిట్ అయిందో మనందరికీ తెలుసు. అంతేకాదు ఈ చిత్రం తర్వాత ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అలా ఇద్దరి కాంబినేషన్లో బాహుబలి బాహుబలి 2 సినిమాలు వచ్చి ప్రపంచ లెవల్లో  తెలుగువారి టాలెంట్ ఏంటో నిరూపించాడు. ప్రస్తుతం రాజమౌళి  మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: