టాలీవుడ్ లో నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో అదరగొడుతున్న విషయం తెలిసింది .. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్నారు .. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే .. మరోవైపు నిర్మాతగా కూడా అదరగొడుతున్నారు .. అలా తన సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ బ్యానర్ పై సినిమాలు తీస్తూ మెప్పిస్తున్నారు .ఇటివ‌ల‌ వచ్చిన కోర్ట్ మూవీ ఎలాంటి సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసింది .. నాని నిర్మించిన ఆ సినిమా చిన్న సినిమాగా రిలీజ్ అయి భారీ విజయం అందుకుంది .. అలాగే ప్రేక్షకుల నుంచి భారీ స్పందన కూడా వచ్చింది .. ఇక నాని త్వరలో మెగాస్టార్ చిరంజీవి , శ్రీకాంత్ ఓదెలా సినిమాను కూడా నిర్మించబోతున్నాడు ..


భారీ బడ్జెట్ తో ఈ సినిమా రాబోతుంది . అయితే ఇదే క్రమంలో హీరోగా ఇటీవల హిట్ 3 తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు .. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో హిట్ ట్రాక్ ను కొనసాగించారు అంతకుముందు .. హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్నారు సరిపోద్దా శనివారం , హాయ్ నాన్న , దసరా సినిమాలు విజ‌య‌లు అందుకుని తన సత్తా చూపించారు .  ఇలా నాని వరుస‌ విజయాలు అందుకుంటున్న .. ఆయన సినిమాలు బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి కాలేద‌ని కొందరు కామెంట్లు పెడుతున్నారు .. అయితే సరిపోద‌ శనివారం , హాయ్ నాన్న , హిట్ 3 వంటి సినిమాలు ఎన్నో ప్రాంతాల్లో నష్టాలు చూసాయని టాక్ వినిపిస్తుంది .. అలాగే ఓవ‌ర్సీస్‌తో పాటు నైజాంలో మంచి వసూలు అందుకున్నాయట ..


కానీ ఆంధ్రాలోని అనేక ప్రాంతాల్లో మాత్రం నష్టాలు వచ్చాయని గుసగుసలు వస్తున్నాయి .. ప్రమోషన్లు ఫుల్ గా ఉన్నప్పటికీ పాన్ ఇండియా రిలీజ్ కొంతమేర ప్రభావాన్ని మాత్రమే చూపించాయని .. అంటూ నానిని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు .. అయితే ఇదే సమయంలో అనేక మంది డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పుడు నానికి సపోర్ట్ గా నిలుస్తున్నారు .. నాని నిర్మించిన కోర్ట్ , నటించిన హిట్‌ 3 సినిమాలు సమ్మర్ సీజన్లు థియేటర్స్ వ్యాపారాన్ని బాగా నిలబెట్టడంలో కీలకపాత్ర పోషించాయని డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారు .. అలాగే ప్రేక్షకులు సినిమాల వైపు తిరిగి ఆకర్షించే కంటెంట్ ను అందించినందుకు  నానిని ప్రశంసించారు .. స్టార్ హీరోల గ్యాప్ తో సినిమాలను విడుదల చేస్తున్నారు నాని వరుసగా మెప్పిస్తారని ఆయనను కొనియాడారు .. తద్వారా నాచురల్ స్టార్ కు గట్టి సపోర్ట్ గా నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: