- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కెరీర్లో సరైన హిట్ సినిమా కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ సినిమా అంచనాలు అందుకోలేదు. రామ్ ఇటీవల కాలంలో హిట్ కొట్టి చాలా యేళ్లు అవుతోంది. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం లో వ‌నే వ‌చ్చిన ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా తర్వాత రామ్ కు సరైన హిట్ లేదు. ఒక హిట్టు పడితే రామ్ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ అవుతాడు. రామ్ - భాగ్యశ్రీ భోర్సే కాంబినేషన్లో దర్శకుడు మహేష్ బాబు పి. తెర‌కెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ఇటీవల టైటిల్ గ్లింప్స్‌ తోనే అదిరే రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా అక్కడ నుంచి సాలిడ్ బజ్‌ సొంతం చేసుకుంది.


మంచి బిజినెస్ ఆఫర్లు కూడా అందుకోవటం మొదలుపెట్టింది. లేటెస్ట్ గా యూఎస్ మార్కెట్ డీల్ ని ఈ సినిమా పూర్తి చేసుకుంది. ఈ సినిమాను ప్రముఖ డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ అయిన ప్ర‌త్యంగిరా సినిమా స్ వారు అమెరికా లో పంపిణీ చేస్తున్నట్టుగా కన్ఫామ్ చేశారు. సో ఇక రిలీజ్ ఎప్పుడు ? అనేది మాత్రం తేలాల్సి ఉంది. ఈ సినిమాకి వివేక్ - మెర్విన్ సంగీతం అందిస్తుండగా .. కన్నడ స్టార్ హీరో రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రి మూవీస్ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమా హిట్ అయితే రామ్ కెరీర్ ట్రాక్ లోకి ఎక్కేస్తుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: