
నైజాం ఏరియాలో ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగింది. టాక్ ఏ మాత్రం పాజిటివ్ గా వచ్చినా ఈ సినిమా సృష్టించే సంచలనాలు మామూలుగా ఉండవు. ఏపీలో సైతం వీరమల్లు సంచలనాలు సృష్టిస్తోంది. హరిహర వీరమల్లు సినిమాలో ట్విస్టులు ఆసక్తికరంగా ఉండనున్నాయన్ సమాచారం అందుతోంది. హరిహర వీరమల్లు సినిమాకు క్రిష్ డైరెక్టర్ కాగా ఆయన ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదు.
హరిహర వీరమల్లు మూవీ హిట్టైతే మాత్రం ఆ క్రెడిట్ క్రిష్ కు దక్కుతుంది. హరిహర వీరమల్లు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విధంగా చేయడం సినిమాకు ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో చూడాలి. నిర్మాత ఏఎం రత్నం కోసమైనా ఈ సినిమా ఆడాలని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
హరిహర వీరమల్లు సినిమా టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. హరిహర వీరమల్లు డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం కాగా సినిమా విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో అందుబాటులోకి వస్తుందేమో చూడాలి. ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఈ తరం ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందో లేదో చూడాలి. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడటం ఈ సినిమాకు మైనస్ అయింది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు మరింత ప్రత్యేకంగా ఉండనున్నాయని తెలుస్తోంది.