
ఎస్ ఇప్పుడు ఇదే విషయం జాతీయ మీడియాలోనూ.. ఇటు సౌత్ మీడియాలోనూ వినిపిస్తోంది. స్పిరిట్‌ను బాలీవుడ్ ఎలా తొక్కాలని చూసిందో అంటూ ఓ కథనం కూడా వైరల్ అవుతోంది. ఈ కథనం ప్రకారం హీరోయిన్ గా ముందుగా ఎంపికైన దీపికకు ఈ సినిమాలో చేస్తున్నందుకు గాను రు. 40 కోట్లు అడిగిందట. అంతా ఓకే అయ్యాక ఆ తర్వాత చాలా గొంతెమ్మ కోర్కెలు కోరిందట. చివరకు దర్శకుడు సందీప్‌కు చిరాకు రావడంతో ఆమెను తీసేసి.. ఆ ప్లేస్‌లో త్రిప్తి దిమ్రిని తీసుకుని జస్ట్ రు. 2 కోట్ల రెమ్యునరేషన్‌కు ఓకే చేసేశాడు. ఆ తర్వాత దీపిక పీఆర్ టీం ఈ సినిమా గురించి నెగటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారట. స్టోరీ ని కూడా వెబ్ సైట్లకు లీక్ చేసేస్తున్నారట.
వీరికి బాలీవుడ్ ఖాన్ ల టీం అంతా తోడు అయ్యి స్పిరిట్‌ను తొక్కేయాలని చూస్తున్నారట. ప్రభాస్ దెబ్బకు ఇప్పటికే వారికి మతులు పోతున్నాయి. ప్రభాస్ సినిమా వస్తుందంటే తమ సినిమాలు వాయిదా వేసుకుంటున్నారు. ఇప్పుడు స్పిరిట్ దెబ్బకు తమ రికార్డులు అన్నీ బ్రేక్ అయిపోతాయన్న భయం తో మరోసారి స్పిరిట్ ను టార్గెట్ చేస్తున్నారట. ఇప్పటికే సౌత్ హీరోలు.. అందులోనూ తెలుగు హీరోలు ఇస్తోన్న పోటీ దెబ్బకు బాలీవుడ్ స్టార్ హీరోల మతులు పోతున్నాయి. ఇక ప్రభాస్ కు ఇప్పుడు బాలీవుడ్ లో క్రేజ్ మామూలుగా లేదు. ఇటు సందీప్ వంగా క్రేజ్ కూడ యానిమల్ సినిమాతో ఎక్కడికో వెళ్లింది. అందుకే వీరిద్దరు కలిస్తే తమకు ఎక్కడ దెబ్బ పడుతుందో అన్న భయం వారిలో ఉంది. అందుకే వాళ్ల కుట్రలకు సందీప్ కౌంటర్ ఇస్తూ ఉతికి ఆరేస్తున్నాడు. సినిమా బిట్ బిట్ లాగా కాదు మొత్తం లేక చేసిన పీకేది ఏంలేదు అని దీపిక కి కౌంటర్ ఇచ్చాడు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు