ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే .. మరోప‌క్క‌ ఆయన ఒప్పుకున్న సినిమాలను కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు .. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన పవన్ ఇప్పుడు ఓజి సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది .. అయితే ఈ క్రమంలోనే గంభీర షూటింగ్ ను ముగించాడు .. విడుదలకు రెడీ అవుతుంది అంటూ చిత్ర యూనిట్ సోష‌ల్‌ మీడియాలో పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే .. ఇక ఇప్పుడు ఓజి షూటింగ్ కంప్లీట్ అవటంతో ఈ మూవీ అనుకున్న టైం కి అంటే సెప్టెంబర్ 25న వస్తుందని అభిమానులు గట్టి నమ్మకంగా ఉన్నారు .. కానీ పవన్ సినిమాల రిలీజ్ విషయం లో ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు అందరికీ తెలిసినవే ..

క్రేజీ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవన్ కు జంటగా ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా .. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు .. అర్జున్ దాస్ , శ్రియా రెడ్డి వంటి వారు కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ , మొదటి గ్లింప్స్‌ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించగా .. పవన్ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నాడు .. ఇక ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో జపనీస్ యాక్టర్ కేయిచి ఆండో కూడా నటించబోతున్నాడట .. ఇదే విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా ప్రకటించారు .. ఈ మూవీ కోసం ఆయన కట‌న ఫైట్ రిహాసిల్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది . ఇక మరి సుజిత్ కాంబోలో వస్తున్న ఓజి బాక్సాఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్ ను ఏ విధంగా ఎలివేట్ చేస్తుందో చూడాలి ..

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి ..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి .

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు ..

మరింత సమాచారం తెలుసుకోండి: