నటి ఎస్తేర్ నోరోన్హ అంటే తెలియని వారు ఉండరు.. ఆమె తన బోల్డ్ నటనతో ఎంతోమందిని ఆకట్టుకుంది.అలా సునీల్ నటించిన భీమవరం బుల్లోడు సినిమాలో హీరోయిన్ గా చేసింది.అలాగే 69 సంస్కార్ కాలనీ, జయ జానకి నాయిక సినిమాలో గీత మాధురి భర్త నందుకి భార్య పాత్రలో నటించింది. ఇక వెయ్యి అబద్ధాలు మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఎస్తేర్.అలా చిన్న సినిమాల్లో హీరోయిన్ గా పెద్ద సినిమాలలో కీ రోల్స్ పోషిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఎస్తేర్ నోరోన్హా ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా కూడా చాలా బోల్డ్ గా మాట్లాడుతుంది. ముఖ్యంగా ఎస్తేర్ ర్యాప్ సింగర్ అయినటువంటి నోయల్ భార్య.కానీ ప్రస్తుతం వీరు విడాకులు తీసుకున్నారు.

ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట పెళ్లయ్యాక నెలరోజులు కూడా కలిసి ఉండలేదు. దాంతో వీరు ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా కూడా వీరి విడాకులకు సంబంధించిన విషయమే ఎక్కువగా అడుగుతారు. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో ఎస్తేర్ మాట్లాడుతూ.. వేశ్యల పై వేశ్య గృహాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.ఎస్తేర్ మాట్లాడుతూ.. సమాజంలో ఉన్న వేశ్యలు కూడా మనుషులే.. కానీ వారిని చాలా చీప్ గా చూస్తారు.. అయితే వాళ్ళు కావాలని అలా మారరు.వారికున్న ఆర్థిక ఇబ్బందులే వారిని అలా మార్చేస్తాయి.. అంతలా సమాజం మారాలనుకుంటే మగాళ్లు వేశ్యల దగ్గరికి వెళ్లి వారిని వాడుకోకుండానే డబ్బులు ఇచ్చి రావచ్చు కదా..

అలాంటి పని ఏ మగాడు చేయడు.. వారిపై కనీస జాలి కూడా ఉండదు. డబ్బులు ఇచ్చి మరీ కోరిక తీర్చుకొని వస్తారు.. వేశ్యలు ఉన్నారంటే వారిని ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పటికీ సమాజంలో తిరుగుతున్నారు.. మగాళ్లు వాళ్ళ దగ్గరికి పోకపోతే అసలు వేశ్యలే ఉండరు కదా.. పోయిన యూస్ చేసుకోకుండా డబ్బులు ఇచ్చే మగాళ్లు కూడా ఈ ప్రపంచంలో లేరు అంటూ వేశ్యలపై సంచలన వ్యాఖ్యలు చేసింది ఎస్తేర్ నోరోన్హా..

మరింత సమాచారం తెలుసుకోండి: