- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ లో మూడేళ్లుగా నిర్మాణంలో ఉన్న పెద్ద భారీ మల్టీస్టారర్ సినిమా కుబేర. ఇద్దరు హీరోలలో ఒకరికి 30 కోట్ల రెమ్యూనరేషన్ ... మరొకరికి 14 కోట్లు. ఈ రెమ్యూనరేషన్ల సంగతి పక్కన పెడితే సినిమాలో ఇద్దరవి హీరోల పాత్రలే .. కథ‌ అంతా వారి చుట్టూ తిరుగుతుంది. సినిమా టికెట్ తెగేది కూడా ఈ ఇద్ద‌రి వ‌ల్లే.. ! మరి అలాంటి సినిమాను కాస్త కాకుంటే కూస్త అయినా ప్రమోట్ చేయాల్సిన బాధ్యత ఆ ఇద్దరికి కచ్చితంగా ఉంది. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు హీరోలు సినిమా ప్రమోషన్ ను పట్టించుకోవడం లేదు. ఈ సినిమా థియేటర్లలోకి రావడానికి ఒక్కరోజు మాత్రమే ఉంది. కుబేర సినిమాకు దర్శకుడు శేఖర్ కమ్ముల ఆయన పనితీరు తెలిసిందే. సినిమా నిర్మాణానికి ఎన్ని రోజులకు వచ్చినా మరో రోజు కావాల్సి ఉంటుంది. అనంత జాగ్రత్తలు తీసుకుంటారు.


దాదాపు మూడేళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. రు. 100 కోట్లకు పైగా బడ్జెట్ .. ఇలాంటి సినిమాను బలంగా జనాలలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నటులు .. టెక్నీషియన్లది. కానీ అలాంటి వ్యవహారం ఏమాత్రం కనిపించడం లేదు. ఇప్పటివరకు హీరోలు ఎవరు ప్రచారంలోకి రాలేదు. ధనుష్ ప్రచారంలోకి దిగే సూచనలు లేవు. నాగార్జున కూడా అలాగే ఉన్నారు. పైగా తెలుగు సినిమా .. తెలుగు నిర్మాతలు తీసిన సినిమా .. నాగార్జున తెలుగు హీరోగా ఉండి కూడా ఈ సినిమాను పట్టించుకోలేదు. శేఖర్ కమ్ముల లాస్ట్ మినిట్ లో తుదిమెరుగులు దిద్దటంలో బిజీగా ఉన్నారు.


ఇక నిర్మాతలు మాత్రం అన్ని ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు, ప్రచారం చేస్తే జనాలు వచ్చేస్తారా ? చేయకపోతే రారా ? అన్న ప్రశ్న వేస్తే ఎవరు ఏమి చెప్పలేరు. కానీ సినిమాకు ఇద్దరు హీరోలు కలిసి ప్రచారం చేస్తే ఖచ్చితంగా మంచి ఓపెనింగ్ వస్తాయి అనటంలో సందేహం లేదు. ఒకవేళ నాగార్జున ఈ సినిమాకు నిర్మాత అయితే ఇలాగే వదిలేస్తారా ? ధనుష్ కూడా నిర్మాత .. దర్శకుడు. నిర్మాత‌ల‌ కష్టాలు తెలిసిన వాళ్ళు ఇద్దరు.. మరి వీళ్ళకి ఈ సినిమాను ఎందుకు ప్రమోట్ చేయాలన్న ఆలోచన లేదు అన్న ప్రశ్నలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాలలో వినిపిస్తున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: