
అయితే సేమ్ ఇదే సిచువేషన్ విజయ్ దేవరకొండ కింగ్డమ్ కూడా ఎదురయింది .. నెట్ ఫ్లిక్స్ తో చేసుకున్న ఒప్పందం మేరకు జులై 25న తప్ప వేరే ఆప్షన్ ఈ సినిమాకు కనిపించడం లేదు .. సితార సంస్థ పవన్ సినిమాతో ఫేస్ టు ఫేస్ ఢీకొట్టేందుకు అసలు ఇష్టపడదు .. ఇప్పటికే కొన్ని సందర్భాల్లో నిర్మాత నాగ వంశీ ఈ విషయాన్ని కూడా క్లారిటీగా చెప్పేశారు .. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఊహించని విధంగా చేజారి పోవటం తో తప్పని పరిస్థితిలో ఈ రిస్క్ చేయాల్సిందే అని డిసిషన్ తీసుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట ..
అయితే పూర్తి క్లారిటీ ఏ విషయంలో అయినా వచ్చేయొచ్చు .. వపోస్ట్ పోన్ పర్వం తో ఇబ్బంది పడుతున్న ఈ రెండు సినిమాలకు ఇప్పుడు ఒకే రకమైన సమస్య రావటం పెద్ద విచిత్రమే .. అయితే దీని గురించి ఇండస్ట్రీలో రకరకాల కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి .. క్రమంగా థియేటర్ రిలీజ్ డేట్ లు ఓటీటీలు ఇంతగా ప్రభావితం చేయడం మంచి పరిణామం కాదని అభిప్రాయం సీనియర్ల నుంచి గట్టిగా వస్తుంది .. ఇలా ఈ రెండు సినిమాలే కాదు ఇతర పెద్ద హీరోల సినిమాలకు సైతం ఇలాంటి ఇబ్బందికర పరిస్తితి రావటం ఒకరకంగా చిత్ర పరిశ్రమకు డేంజర్ బెల్ లాంటిదని .. ఇక పై ఎగ్రిమెంట్లు చేసుకునే సమయం లో ఎలాంటి డేట్ లైన్లు లేకుండా రాసుకుంటే తప్ప దేనికి సరైన పరిష్కారం దొరికేలా కనిపించడం లేదు.