
మమ్ముట్టి తీవ్ర అనారోగ్యం అన్న వ్యాఖ్యలలో ఎలాంటి నిజము లేదని వెల్లడించారు.. దీంతో కొంతమేరకు ఊపిరి పీల్చుకున్నారు అభిమానులు. అయితే తాను మమ్ముట్టితో ఫోన్లో మాట్లాడానని వెల్లడించారు. ఆయన స్వల్ప అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారని వెల్లడించారు. అందుకు సంబంధించిన చికిత్స కూడా తీసుకుంటున్నారని తెలియజేయడం జరిగింది. మమ్ముట్టి క్షేమంగానే ఉన్నారని ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదంటూ మమ్ముట్టి స్నేహితుడు జాన్ బ్రిట్టాస్ తెలియజేశారు.
మలయాళ సినీ ఇండస్ట్రీలోని దిగ్గజ నటుడుగా పేరుపొందిన మమ్ముట్టి గత కొద్దిరోజులుగా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విధంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఈ వ్యాఖ్యలకు సరైన సమాధానలు దొరకకపోవడంతో ఈ ఊహాగానాలు వైరల్ గా మారాయి. మమ్ముట్టి చిన్నపాటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారని కానీ ఆందోళన చెందాల్సిన పని లేదంటూ తన స్నేహితుడు కూడా తెలియజేశారు. గత కొద్దిరోజులుగా మమ్ముట్టి క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నారని ప్రచారం కూడా జరుగుతొంది.కానీ ఈ విషయం పైన మమ్ముట్టి టీమ్ అందులో ఎలాంటి నిజం లేదంటూ వెల్లడించింది. అవన్నీ కూడా ఫేక్ రూమర్సే అన్నట్లుగా తెలిపారు. మరి వీటన్నిటికీ సమాధానం రావాలి అంటే మమ్ముట్టి సోషల్ మీడియా వేదికగా ఏదైనా స్పందిస్తారమో చూడాలి.