- ( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ ) . . .

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన భారీ పాన్ ఇండియా సినిమా కన్నప్ప ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ క్రమంలోని ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాను తెరకెక్కించటం ఎంతో ఆనందంగా ఉందని దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ అన్నారు. ఈ సినిమా కోసం టీం అందరూ ఎంతో శ్రమించారని ఆయన తెలిపారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కూడా నటించడంతో దేశవ్యాప్తంగా కన్నప్ప సినిమాపై అన్ని భాషలలో భారీ అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు ప్రభాస్ రావాలని అనుకున్న ప్రభాస్ బిజీ షెడ్యూల్ తో కుదరలేదని మంచి విష్ణు తెలిపారు.


ప్రభాస్ కు మొహమాటం ఇందులో భాగమైనందుకు ప్రభాస్ కు ఎప్పటికీ రుణపడి ఉంటానని ప్రభాస్ మనస్తత్వం తనకు బాగా తెలుసన్నారు. ఇక ప్రభాస్ ని ఇబ్బంది పెట్టే పనులు చేయడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదని విష్ణు తెలిపారు. ఇక ఈ సినిమాకు ఒక వీడియో బైట్‌ పంపిస్తా అని ప్రభాస్ అన్నారని అని .. వారి కారణాల వల్ల అది సాధ్యపడలేదని తెలిపారు. ప్రభాస్ వల్ల ఈ సినిమాను ఇంత భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నామని ఈ సినిమాలో ప్రభాస్ రోల్ 40 నిమిషాలు ఉంటుందని తెలిపారు. ఈ సినిమాని కేరళలో సుమారు 300 ధియేటర్లలో విడుదల చేస్తున్నామని ... మోహన్లాల్ వల్లే కేరళలో ఈ సినిమా ఆ స్థాయిలో విడుదలవుతుందని ... మోహన్ లాల్ పాత్ర సినిమాలో చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందని మంచి విష్ణు తెలిపారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: