- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

లేటెస్ట్ గా తెలుగు సినిమా నుంచి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి వచ్చిన మోస్ట్ అవైటెడ్‌ సినిమా కన్నప్ప. మంచు విష్ణు హీరోగా టాలీవుడ్ యంగ్ రెబ‌ల్‌ స్టార్ ప్రభాస్ - అక్షయ్ కుమార్ - మ‌ల్లూవుడ్ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ఇంకా అనేకమంది బిగ్ స్టార్స్ కలయికలో వచ్చిన ఈ సినిమా విడుదల రోజే సినిమాపై ఉన్న చాలా సందేహాలు పటాపంచలు చేసి అదరగొట్టింది. మంచి స్టార్ట్ అందుకున్న ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అంటూ మేక‌ర్స్ పోస్ట‌ర్ వదిలారు. ఈ పోస్ట‌ర్‌ ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనంగా మారింది. తెలుగులో ఆయా సినిమాలో తాలూకా ఫలితాలని హిట్ ... సూపర్ హిట్ .. బ్లాక్ బస్టర్ హిట్ ఆ తర్వాత ఇండస్ట్రీలో అన్ని రికార్డులు తిరగా రాస్తే ఇండస్ట్రీ హిట్ అని చెబుతూ ఉంటారు.


కానీ ఇప్పుడు కన్నప్ప సినిమాను మొదటి రోజు రన్ తర్వాత మేకర్స్ కన్నప్ప ఇండస్ట్రీస్ అని చెప్పుకోవడం ఒకంత షాకింగ్ అని చెప్పక తప్పదు. అయితే మేకర్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో హిట్ అనే కోణంతో వేశారా ఏంటి ? అన్నది ఎవరికి అర్థం కావటం లేదు. ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలోనూ సోషల్ మీడియా లోనూ చర్చగా మారింది. ఇటీవల కాలంలో పోస్టర్స్ రచ్చ తెలుగు సినిమాలో ఎలా ఉంటుందో ? అందరికీ తెలిసిందే. మరి కన్నప్ప ఇండస్ట్రీ కిట్ పోస్టర్ పై ఎలాంటి రచ్చ జరుగుతుందో చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: