- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

కృష్ణ బురుగుల, ధీరజ్ అథేర్య, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో మౌంట్ మెరు పిక్చర్స్ ఓ యూత్‌ఫుల్ క్రేజీ ఎంటర్‌టైనర్‌ని నిర్మిస్తోంది. హరిష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ వోడపల్లి నిర్మాత. ఈ చిత్రానికి “జిగ్రీస్” అనే క్రేజీ టైటిల్ ఖరారు చేశారు. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా జిగ్రీస్ టైటిల్, ఫస్ట్ లుక్‌ని లాంచ్ చేసి టీంకి ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఒక వింటేజ్ మారుతీ 800 కారు పక్కన నిలబడ్డ నలుగురు ఫ్రెండ్స్‌ని పై నుంచి చూపించడం ఇంట్రస్టింగ్‌గా ఉంది. బోల్డ్ ఆరెంజ్ బ్యాక్‌డ్రాప్, గ్రిట్టీ టైటిల్ టైపోగ్రఫీ... సినిమా ఎంత అడ్వెంచరస్‌గా ఉండబోతోందో తెలియజేస్తోంది.


ఈ ఫస్ట్ లుక్, టైటిల్  సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేసింది. జిగ్రీస్ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్షిప్, నాస్టాల్జియా, క్రేజీ అడ్వెంచర్స్, హిలేరియస్ రోడ్ ట్రిప్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది. ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ఈశ్వరాదిత్య డీవోపీ , కమ్రాన్ మ్యూజిక్ , చాణక్య రెడ్డి ఎడిటర్. త్వరలోనే సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ తెలియ జేస్తారు. ఏదేమైనా జిగ్రీస్ అనే టైటిలే చాలా ఎట్రాక్టివ్ గా ఉండ‌డంతో అంద‌రూ సినిమా కంటెంట్ కూడా అలాగే ఉంటుంద‌న్న అంచ‌నాల తో ఉన్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: