జయం, దిల్, సై సినిమాలతో కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను సొంతం చేసుకున్న నితిన్ తర్వాత రోజుల్లో వరుస ఫ్లాప్స్ వల్ల కెరీర్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలతో ఊరట దక్కినా తర్వాత రోజుల్లో నితిన్ అదే మ్యూజిక్ రిపీట్ చేయలేదు. భీష్మ, రంగ్ దే సినిమాల తర్వాత నితిన్ కు భారీ షాకులు తగులుతున్నాయి. రాబిన్ హుడ్ సినిమాతో నిరాశపరిచిన నితిన్ తమ్ముడు సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకున్నారో చూద్దాం.

కథ :

జై (నితిన్)  విలువిద్యలో దేశానికి గోల్డ్ మెడల్ తీసుకొనిరావాలనే బలమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంతో పాటు ఆ లక్ష్యాన్ని  సాధించడం కోసం తన వంతు కష్టపడుతూ  ఉంటాడు.   కానీ ఆ లక్ష్యాన్ని  సాధించడంలో ఫెయిల్ అవుతూ ఉంటాడు.  ఆ సమయంలో కోచ్ చెప్పిన మాటలు విని   తనలో ఉన్న సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తాడు. జై తన అక్క ఝాన్సీ కిరణ్మయి(లయ) కి ఎదురైన సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తాడు?  ప్రభుత్వ అధికారిగా పని చేస్తున్న  ఝాన్సీకి  అగర్వాల్ (సారా సచ్ దేవా) నుంచి ఎదురైనా ఇబ్బందులు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.


విశ్లేషణ :

యాక్షన్ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో  నితిన్ అద్భుతమైన నటనను కనబరిచారు.  అటు యాక్షన్ సన్నివేశాల్లో  ఇటు ఎమోషనల్ సన్నివేశాల్లో  ప్రతిభను చాటుకున్నారు.  అయితే నితిన్ పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దే విషయంలో దర్శకుడు తడబడ్డాడు. తమ్ముడు మూవీ స్టోరీ లైన్ బాగానే ఉన్నా స్క్రీన్ ప్లే  ఏ మాత్రం ఆకట్టుకునే విధంగా లేదు.  వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ సినిమాలో  కీలక పాత్రల్లో నటించినా  వాళ్లకు పాత్రలకు తగిన ప్రాధాన్యత అయితే  దక్కలేదు.  విలన్ సౌరభ్ సచ్ దేవా  మాత్రం పాత్రకు తన వంతు న్యాయం చేశారు.  

దర్శకుడు శ్రీరామ్ వేణు  తెరకెక్కించిన ఎంసీఏ సినిమా షేడ్స్ కూడా ఈ సినిమాలో కొంతమేర ఉన్నాయి.  సినిమాలో చాలా సన్నివేశాలు ఊహించే విధంగా ఉన్నాయి.  ఇంటర్వెల్ సీన్ బాగానే ఉన్నా రొటీన్ క్లైమాక్స్  సినిమాకు  మైనస్ అయింది.  సీనియర్ హీరోయిన్ లయకు  రీఎంట్రిలో మంచి పాత్ర దక్కినా   ఈ సినిమా ఆమె కెరీర్ కు ఎంతమేర  ఉపయోగపడుతుందో చూడాలి.

నిర్మాత దిల్ రాజు మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకునే విషయంలో ఫెయిలవుతున్నారు.  ఈ ఏడాది గేమ్ ఛేంజర్  సినిమాతో దిల్ రాజుకు షాక్ తగలగా ఈ సినిమాతో అంతకుమించి  షాక్ తగిలింది. ఈ మధ్య కాలంలో క్రేజ్ ఉన్న హీరో నటించి ఈ స్థాయిలో నిరాశ పరిచిన సినిమా అయితే లేదు. ఫస్టాఫ్ తో పోల్చి చుస్తే సెకండాఫ్  బెటర్ గా ఉంది.

మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ సాంగ్స్, బీజీఎమ్ తో  తన వంతు నాయయం చేశారు.  సినిమాటోగ్రఫీ పరవాలేదనే విధంగా ఉండగా  ఎడిటింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే  బాగుండేది.  

బలాలు :  నితిన్ యాక్టింగ్, ఇంటర్వెల్,  సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు.

బలహీనతలు  : ఫస్టాఫ్, ఎడిటింగ్,  స్క్రీన్ ప్లే, డైరెక్షన్,  రొటీన్ సీన్స్

రేటింగ్ : 1.75/5.0

మరింత సమాచారం తెలుసుకోండి: