ప్రస్తుత టెక్నాలజీ కాలంలో దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్, అందులో యూట్యూబ్ ఖచ్చితంగా ఉంటోంది. పిల్లల నుంచి ముసలి వారి వరకు యూట్యూబ్ అంటే తెలియని వారు ఉండడం లేదు. గంటలు తరబడి యూట్యూబ్ లో మునిగిపోతున్న వారు ఇంటికి ఒక్కరైనా ఉంటున్నారు. మరోవైపు యూట్యూబ్ లో కంటెంట్ క్రియేటర్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. డబ్బు సంపాదించడం కోసం లేదా ఫేమస్ అవడం కోసం చాలామంది సొంతంగా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. దాంతో ప్రతి నిమిషం కొన్ని వందల వేల వీడియోలు యూట్యూబ్ లో అప్లోడ్ అవుతున్నాయి. అయితే మనం బిజీ లైఫ్‌లో ఒక భాగ‌మైపోయిన యూట్యూబ్ లో టాప్ 5 ఛానెల్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ జాబితాలో నెం. 1 స్థానంలో ఉంది MrBeast(అమెరికా). ఈ ఛానెల్ కు సుమారు 411 మిలియన్ స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు. అనూహ్య ప్రాజెక్టులు, శిక్షణ ఛాలెంజ్‌లు, దాతృత్వ కార్యక్రమాల ద్వారా ఈ ఛానెల్ టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది.


ఆ త‌ర్వాతి ప్లేస్ లో  మ్యూజిక్/బాలీవుడ్ ప్రొడక్షన్ దిగ్గజం T‑Series(ఇండియా) నిలిచింది. టీ-సిరీస్ యూట్యూబ్ ఛానెల్ కు ఏకంగా 298.2 మిలియన్ స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు. రోజుకు సగటున 66 కె కొత్త సబ్‌స్క్రైబర్లను ఈ ఛానెల్‌ పొందుతోంది.


టాప్ 3లో Cocomelon - Nursery Rhymes(అమెరికా) ఉంది. పిల్లల క్యాటిగరీలో ఈ ఛానెల్ విపరీతంగా ప్రాచుర్యం పొందింది. ఈ ఛానెల్ కు 195 మిలియన్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.


SET India(ఇండియా) 185 మిలియన్ సబ్‌స్క్రైబర్లతో నాలుగో స్థానంలో కొన‌సాగుతోంది. ఎంటర్‌టైన్‌మెంట్ వర్గంలో ఇండియాలో నెంబ‌ర్ 2గా స‌త్తా చాటుఓంది. హిందీ సోషల్ షోస్, డైలీ సీరియల్స్, రియాలిటీ షోస్, సినిమాలు, ట్రైల‌ర్స్‌ అప్లోడ్ చేయడం తో ఈ ఛానెల్‌ అత్యధిక సబ్‌స్క్రైబర్లను సంపాదించుకుంది.


ఇక టాప్ 5 లో Vlad and Niki(అమెరికా) ఉంది. ఈ ఛానెల్ కు 142 మిలియ‌న్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఛానెల్ కూడా పిల్లోలకు పూర్తి వినోదం మరియు ఆటతో పూరిత అనుభవాలని అందిస్తూ ప్రాచూర్యం పొందింది. ప్రీస్కూల్ ఫెనామెనన్ కూడా పేరు తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: